అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన సాహో ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేసింది. ఇవ్వాళ రిలీజ్ అయిన ఈ సాహో ఒక చరిత్రను సృటించిందనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా ఈ సినిమా రావడం అందరికి కన్నుల పండుగ అనే చెప్పాలి. డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. బాహుబలి తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు బాగానే  సంపాదించింది. 
ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమన్నారంటే సినిమా మేము ఊహించినదానికంటే చాలా ఎక్కువగా ఉంది.

ఈ సినిమాలో ఉన్న ప్రభాస్ ను ముందు అయన చేసిన సినిమాలలో ఎప్పుడు చూడలేదు. కొందరు సినీ ప్రముఖులు బిర్లా సినిమాల ఉంది అన్న కూడా, ఆ సినిమాను బిర్లా దాటలేదు అని అయన అభిమానులు వెల్లడిస్తున్నారు. ప్రభాస్ యాక్షన్ అయన అభిమానులతో పాటుగా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా లుక్ కూడా చాలా బాగుంది అని అంటున్నారు. 

మేము ఊహించిన ప్రభాస్ వేరు ఈ సినిమాలో ప్రభాస్ వేరుగా ఉన్నారు. కథలో ట్విస్టులు, ఫైట్లు మాములుగా లేవు. హీరోయిన్ కూడా చాలా బాగా ఫైట్స్ చేసింది. డార్లింగ్ ను మించిన మార్కులు కొట్టేసింది అని జనాలు అంటున్నారు. ఎన్నో ట్విస్టులతో ఈ కథ అల్లుకుపోయింది. ఈ సినిమా చూసినంతసేపు టాలీవుడ్ సినిమా అని అనుకొము. హాలీవుడ్ రేంజులో ఈ సినిమాలో యాక్షన్స్ ఉండాలని, హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ను రంగంలోకి దించారు సినీ దర్శకులు. మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ సినిమా మాకు నచ్చింది అని అభిమానులు అంటున్నారు. 

క్రిటిక్స్ విషయానికొస్తే.. ఈ సినిమాలో అనుకున్న విదంగా కథ లేదు. మొదట అర్ధగంట మాత్రమే ఈ సినిమా పర్లేదన్నట్లు ఉంది. మిగతా కథ మొత్తం రోజు చూస్తున్నట్లు ఉంది. రొమాన్స్, యాక్షన్ అంతా కామన్ అయిపొయింది.ఈ సినిమా కేవలం కొద్దీ రోజులు మాత్రం ఆడుతుందని వారు రివ్యూ రాసుకున్నారు. మరి సినిమా పరిస్థితి అలా ఉంటుందో మున్ముందు చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: