‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ గత 10 రోజులుగా ఎన్నో మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రభాస్ అనేక ఆసక్తికర విషయాలు వివరించాడు. ఈ సందర్భంలో ప్రభాస్ ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ వారిలో తనకు బాగా ఇష్టమైన యంగ్ హీరో పేరు బయట పెట్టాడు. ప్రభాస్ కు అందరి టాప్ హీరోలతో సాన్నిహిత్యం ఉన్నా అతడి నోటి వెంట ఒక హీరో పేరు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ తనకు బాగా ఇష్టమనీ అతడి నటన మాత్రమే కాకుండా అతడి యాటిట్యూడ్ కూడ తనకు బాగా నచ్చుతుంది అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో విజయ్ అభిమానులు ప్రభాస్ చేసిన కామెంట్స్ కు ఫిదా అయిపోయారు. 

ఇప్పుడు ఈ కామెంట్స్ విజయ్ దృష్టి వరకు వచ్చినట్లు ఉన్నాయి. అందుకే విజయ్ కూడ ఆ కామెంట్స్ కు తన ఋణం తీర్చుకున్నాడు. ‘సాహో’ ఎంత కష్టపడి నిర్మించారో తనకు తెలుసు అని అంటూ ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా అని చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ చేసాడు. వాస్తానికి ఈ సినిమా గురించి రాజమౌళితో పాటు ఇతర సెలెబ్రెటీల స్పందన ఎలా ఉంటుంది అన్న ఆసక్తి బాగా ఉంది. 

ఇప్పుడు విజయ్ దేవరకొండ పాజిటివ్ కామెంట్స్ కూడ తోడైతే విజయ్ అభిమానుల సపోర్ట్ ఎంతవరకు ‘సాహో’ కు లభిస్తుందో చూడాలి. ప్రభాస్ అందరివాడు కాబట్టి ఈ మూవీకి ఇప్పటికే వచ్చిన డివైడ్ టాక్ ను ఎదిరించి నిలబడటానికి నిజంగానే విజయ్ ఈ రోజు ‘సాహో’ ను చూసి తన కామెంట్స్ ను షేర్ చేయగలిగితే అన్న మాట పై నిలబడే మనస్తత్వం విజయ్ దేవరకొండకు ఉంది అని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: