బుల్లితెర షోలలో ఎన్ని కొత్త వెరైటీ షోలు వచ్చినా ‘జబర్దస్త్’ మ్యానియా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు దీనితో ఈషో ప్రారంభం అయి సుమారు 5 సంవత్సరాలు అవుతున్నా ఈ షోకు రేటింగ్స్ విషయంలో ఎక్కడా డౌన్ ఫాల్ కనిపించడం లేదు. ఈషోను అనుకరిస్తూ మరికొన్ని ఛానల్స్ ప్రయాతాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏవీ విజయవంతం కాలేదు. 

ఈ సమయంలో ఈ షోలో పాల్గొంటున్న కొందరు ప్రముఖ సెలెబ్రెటీల పారితోషికాలు ఇప్పుడు లీక్ అయ్యాయి. ఈ షోకి సంబంధించి స్కిట్స్ ప్రజెంట్ చేయడంలో అత్యంత నిష్ణాతులైన హైపర్ ఆది చమక్ చంద్ర సుడిగాలి సుధీర్ లలో హైపర్ ఆదీకి నెలకు మూడు లక్షలు పారితోషికం అయితే చమక్ చంద్ర సుడిగాలి సుధీర్ లకు నెలకు నాలుగు లక్షలు చొప్పున పారితోషికం అందుతున్నట్లు సమాచారం.   

గతంలో వీరందరికీ ఒక స్కిట్ కు కొంత మొత్తం అన్న లెక్కన ఇచ్చే వారని ఇప్పుడు పద్ధతి మారి వీరంతా ఈ కార్యక్రమానికి నెల జీతగాళ్లుగా మారిపోయినట్లు టాక్. ఎలా చూసుకున్నా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఏ ఆర్టిస్ట్ కు అయినా కనీసం నెలకు 75 వేలు చొప్పున పారితోషికం అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇక ఈ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు నెలకు 20 లక్షలు రోజాకు నెలకు 15 లక్షలు పారితోషికంగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న అనసూయకు నెలకు 4 లక్షలు రష్మికి నెలకు మూడు లక్షలు ఇస్తున్నారు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు బుల్లితెర వర్గాలలో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ కార్యక్రమం పై ఎన్నో విమర్శలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకుని ఈ షో నిలబడటమే కాకుండా ఈషో ద్వారా పరిచయం అయిన ఎందరో నటులు ప్రస్తుతం సెలెబ్రెటీల స్థాయికి ఎదిగి పోయారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: