కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో విశాల్ వివాహ నిశ్చితార్థం హైదరాబాద్ నగరంలో గతంలో చాలా అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లి కూడా త్వరలోనే అంగరంగ వైభవంగా జరగబోతుందని భావిస్తున్న తరుణంలో విశాల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో మరియు తమిళ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల వార్తలు విజయవాడ వస్తున్నాయి. అందరూ విశాల్ పెళ్లి గురించి ఎదురు చూస్తున్న తరుణంలో విశాల్ పెళ్లి క్యాన్సల్ అంటూ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయంటూ దీంతో పెళ్లి బ్రేక్అప్ అయినట్లు ఇలా అనేక రకాల కథనాలు విశాల్ పెళ్లి గురించి రావటం జరిగాయి.


ఇద్దరి అభిప్రాయాలు కలవకపోవడం వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని చాలా మంది అంటున్న తరుణంలో అనూహ్యంగా విశాల్ నిశ్చితార్థం చేసుకున్న తెలుగమ్మాయి అనీష ఇటీవల విశాల్ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి క్యాన్సిల్ అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేటట్లు పోస్టు పెట్టింది. విశాల్ బర్త్ డే నాడు అనీషా విశాల్ కి విషెస్ చెబుతూ..నీ జీవితాంతం నీతో నేను ఉండాలని కోరుకుంటున్నాను, మనిద్దరి జర్నీ హ్యాపీగా సాగాలని ఆశిస్తున్నాను.


ఈ సందర్బంగా హ్యాపీబర్త్‌డే నీకు అంటూ అనీష సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అనీష పోస్ట్‌తో విశాల్‌ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందనే వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది. అయితే ఎప్పుడు వీరిద్దరి పెళ్లి జరుగుతుందనే విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విశాల్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అదే విధంగా ఆమద్య జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో సరైన సమయంలో కంగారు పడకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో విశాల అనీష ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పెళ్లి పై వస్తున్న రూమర్లకు విశాల్ కాబోయే భార్య క్లారిటీ ఇచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: