ప్రభాస్ సాహో సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది.  ఈ స్థాయిలో నిర్మించిన సినిమా కాబట్టి దీనిపై అంచనాలు భారీగా ఉంటాయి.  అందులో సందేహం అవసరం లేదు.  సినిమా బాగుందనే టాక్ వస్తున్నా.. పెద్దగా కథ లేదని, విజువల్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవని టాక్ వచ్చింది. 


దీనిపై హీరోయిన్ శ్రద్దా కపూర్ స్పందించింది.  సినిమాను కొందరు పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నారని.. సినిమా బాగుంది లేనిది థియేటర్ కు వెళ్లి చూస్తేనే అర్ధం అవుతుందని చెప్పింది.  ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదన్న సంగతి అందరికి తెలిసిందే.  సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రభాస్ యాక్టింగ్ కు డైయార్డ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  ఎలాగో కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తారు దాని గురించి ఫీలవ్వాల్సిన అవసరం లేదు.  


అయితే, ప్రతి సినిమాను ఇబ్బంది పెట్టె సన్నివేశం పైరసీ.  సినిమా చిన్నదా పెద్దదా అనే తేడా లేదు.  ఏ సినిమా అయినా.. రిలీజైన సాయంత్రానికే నెట్లో వచ్చేస్తున్నది.  ఇదే ఇప్పడు ప్రతి ఒక్కరిని ఇబ్బందిపెట్టే అంశం.  పైరసీని అడ్డుకోవడానికి సినిమా ఇండస్ట్రీ ఎంతగా ట్రై చేస్తున్నా వల్లకావడం లేదు.  ఎక్కడో ఒక చోట నుంచి పైరసీ పంజా విసురుతోంది.  కోట్లాది రూపాయల మేర నష్టం వచ్చేలా చూస్తున్నది.  


పైరసీకి  అడ్డుకట్ట వేయాలని, పైరసీను అడ్డుకోవాలని చెప్పి హీరోయిన్ శ్రద్ధాకపూర్ అన్నారు.  పైరసీని అడ్డుకున్నప్పుడే సినిమా నిలబడుతుంది.  నిర్మాతలు నిలబడతారు.  ప్రభాస్ ఫ్యాన్స్ పైరసీపై యుద్ధం చేయాలనీ, ఎక్కడైనా ఎవరైనా పైరసీ చేస్తున్నారని తెలిస్తే కంప్లైంట్ చేయాలని కోరింది.  డైహార్డ్ ఫ్యాన్స్ అని చెప్పి పైరసీని పట్టుకోమని చెప్తే ప్రభాస్ అభిమానులు ఊరుకుంటారా చెప్పండి.  యుద్ధం మొదలెట్టేయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: