యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రద్ధ కపూర్ జంట‌గా న‌టించిన చిత్రం `సాహో` ఈ రోజు థియేట‌ర్‌లోకి అడుగుపెట్టింది. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇదిలా ఉంటే వాస్త‌వానికి దేశం మొత్తాన్ని ఆక‌ట్టుకునే సినిమాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. ఇక హిందీ సినిమాలు ఉత్త‌రాదికే ప‌రిమితం అవుతాయి త‌ప్ప ద‌క్షిణాదిన వాటికి క్రేజ్ ఉండ‌దు. కానీ.. ఆల్ ఇండియాను ఆక‌ర్షించిన సినిమా ఏదైనా ఉందా అంటే.. అది `బాహుబ‌లి` మాత్ర‌మే. 


ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `2.0` చిత్రంకు దేశ‌వ్యాప్తంగా ఓ మోస్త‌రు క్రేజ్ ఏర్ప‌డింది. ఇక ఇప్పుడు బాహుబ‌లి స్థాయిలో, ఫుల్ ఫామ్ మీద `సాహో` గ్రాండ్ రిలీజ్ అయింది. అన్ని ఇండ‌స్ట్రీ వాళ్లు ప్ర‌త్యేక దృష్టి సారించిన ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా వ‌స్తాయి అన్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. భారీ యాక్ష‌న్ థిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం బాహుబ‌లి వ‌సూళ్ల‌కు ధీటుగా వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోల‌తో మోత‌మొగింది. 


సినిమా విడుద‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన టైంలో టిక్కెట్ల రేట్లు కూడా భారీగానే పెంచేశారు. అయినా కూడా సాహో రిలీజ్ అయిన‌ తొలి రోజు ఏ ఒక్క‌ థియేట‌రు ఖాళీ లేకుండా హౌస్ ఫుల్స్ అయిన‌ ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.35-40 మ‌ధ్య షేర్‌, గ్రాస్ రూ. 50 కోట్లను దాటే అవ‌కావం ఉంద‌ని భావిస్తున్నారు. అయితే కేరళ, త‌మిళ‌నాడులో ప‌రిస్థ‌తి అంత అనుకూలంగా లేక‌పోయినా క‌ర్ణాట‌క‌లో మాత్రం మంచి హైప్ క‌నిపిస్తోంది. మ‌రియు ఉత్త‌రాదిలో ఓ మోస్త‌రుగా క్రేజ్ క‌నిపిస్తోంది.


ఇక బయట‌ రాష్ట్రాలన్నిటిని, విదేశాల్లో కలిపి రూ.50 కోట్లకు త‌గ్గ‌కుండా గ్రాస్ వ‌చ్చే అవకాశాలున్నాయి. ఏదేమైనా సాహో ఫ‌స్ట‌డే షేర్ 60 కోట్ల‌కు త‌గ్గ‌కుండా, గ్రాస్‌ రూ. 100 కోట్లపైనే రాబ‌డుతుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. మ‌రి తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎలా ఉండ‌బోతున్న‌యో కొంత స‌మ‌యం వేయిట్ చేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: