‘సాహో’ కు డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ మీడియా ఈ సినిమా పై వ్రాస్తున్న రివ్యూలు చూస్తుంటే బాలీవుడ్ మీడియాకు దక్షిణాది సినిమాల పై ఎంత చిన్న చూపు ఉందో మరొకకసారి అర్ధం అవుతుంది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీయడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ వర్కౌట్ కావాలి అంటే బాలీవుడ్ లో కూడ ఘన విజయం సాధించాలి కాబట్టి ప్రభాస్ మొదటి నుండి ఈ సినిమా విషయంలో బాలీవుడ్ కు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఈ మూవీకి సంబంధించి కీలక పాత్రలలో బాలీవుడ్ టాప్ స్టార్ ల చేత నటింపచేసాడు.

అంతేకాదు ఈ మూవీని తెలుగులో కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే ప్రమోట్ చేసాడు. అయితే మొదటి నుండి ఈ మూవీ ఫలితం గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న బాలీవుడ్ మీడియా ‘సాహో’ టాక్ లో తేడా కనిపించడంతో ఇప్పుడు ఈ మూవీని టార్గెట్ చేస్తూ భయంకరమైన రివ్యూలు ఇస్తోంది. 

ఇందులో భాగంగా బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ తరుణ్ ఆదర్శ ‘సాహో’ కి 1.5/5 రేటింగ్ ఇవ్వడంతో ఈమూవీ బాలీవుడ్ లో భంకరమైన ఫఫ్లాప్ గా మారుతుందా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు బలహీనమైన కథ హాస్యం లేకపోవడం లాంటి విషయాలు తోడు కావడంతో బాలీవుడ్ మీడియాకు ‘సాహో’ ని ఎండగట్టడానికి అన్ని అస్త్రాలు దొరికాయి. 

హిందీలో మంచి పాపులారిటీ ఉన్న ఫిలిం క్రిటిక్స్ లో తరుణ్ ఆదర్స్ ముందు వరసలో ఉంటాడు ఇతని రివ్యూలు చూసి సినిమాలకు వచ్చే లక్షలాది మంది ప్రేక్షకులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ బాలీవుడ్ క్రిటిక్ ‘సాహో’ పై ఇచ్చిన రివ్యూతో ఈ మూవీ ఉత్తరాదిలో ఘోరమైన ఫ్లాప్ గా మారే ఆస్కారం ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు ఇప్పటికే డివైడ్ టాక్ రావడంతో పాటు బాలీవుడ్ టాక్ కూడ పూర్తి నెగిటివ్ గా ఉండటంతో ‘సాహో’ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవా అన్న సందేహాలు కలుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: