ఈమధ్య కాలంలో తెలుగు సినిమా రేంజ్ మారిందని తెలిసిందే. బాహుబలితో అది ప్రూవ్ అయ్యింది. ఓ తెలుగు సినిమా స్టామినా ఏంటో బాహుబలి ప్రూవ్ చేసింది. ఆ సినిమా తర్వాతనే తెలుగు సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి.. అయితే దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయాలని చూస్తున్నారు తప్ప అందులో కథ ఉండాలన్న విషయం మర్చిపోతున్నారు.    


ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా కూడా 350 కోట్ల బడ్జెట్ తో వచ్చినా కథ ఎంత వీక్ గా ఉందో తెలిసిందే. టాలీవుడ్ లో రొటీన్ అయిన కథను, రొటీన్ స్క్రీన్ ప్లే భారీ హంగులు అద్ది తెరకెక్కించాడు సుజిత్. రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమాతో విజయాన్ని అందుకున్న సుజిత్ కు సాహో లాంటి భారీ ప్రాజెక్ట్ ఇవ్వడమే పొరపాటని అంటున్నారు.         


ప్రభాస్ కు ఉన్న నేషనల్ వైడ్ ఫాలోయింగ్ తో కథకు అవసరం లేకున్నా సరే భారీ ఖర్చు పెట్టేసి బడ్జెట్ పెంచేశారని అనిపిస్తుంది. కథలో దమ్ము లేకుండా బడ్జెట్ ఎంత పెట్టినా వేస్ట్ అన్నది ప్రేక్షకుల లాజిక్. మరి ఈ విషయాన్ని మేకర్స్ ఎలా విస్మరించారో తెలియాల్సి ఉంది. సాహో సినిమా మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. 


అయితే యాక్షన్ ప్రియులను మెప్పించే అంశాలు ఉన్నాయి. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే అంశాలు ఉన్నాయి. కథ, కథనాల పరంగా సుజిత్ ఇంకాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది కథ పాతదే కావడంతో కథనం కూడా ప్రిడిక్టబుల్ గా నడుస్తుంది. డివైడ్ టాక్ వచ్చినా రెండు మూడు రోజుల వరకు కలక్షన్స్ కు ఢోకా ఉండదని మాత్రం చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: