ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ప్రచారంలో ఉన్న సాహో ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ డైరక్షన్ లో వచ్చిన సాహో సినిమా కేవలం భారీ యాక్షన్ సీక్వెన్సుల కోసం తప్ప విశేషం ఏం లేదని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకు బీభత్సమైన నెగటివ్ టాక్ వచ్చింది. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం అవసరానికి మించి బడ్జెట్ పెట్టడం సినిమాకు మైనస్ లుగా చెప్పుకుంటున్నారు.


మొదటి నుండి ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా చెప్పుకొచ్చారు. కాని ప్రభాస్ చెప్పినట్టుగా సినిమాలో అసలు స్క్రీన్ ప్లే వర్క్ అవుట్ కాలేదు. గ్యాంగ్ స్టర్ సినిమాకు కావాల్సిన ట్విస్ట్, ఎక్సైట్మెంట్ కలిగించడంలో సాహో విఫలమైందని చెప్పొచ్చు. కేవలం ఎంతసేపు భారీతరనమే తప్ప కథ, కథనాల మీద దృష్టి పెట్టలేదు.  


ఈ సినిమాను బాహుబలితో పోల్చుతూ ప్రచారం చేశారు. అసలు ఈ సినిమాకు బాహుబలికి ఎక్కడ సంబంధం లేదు. బాహుబలి సినిమాలో రాజమౌళి పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేశాడు కాని సాహోలో సుజిత్ అనవసరమైన హంగులకు పోయి డబ్బు వృధా చేశాడని అనిపిస్తుంది. ప్రభాస్ కు బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ కాస్త సాహోతో పోగొట్టుకునేలా ఉన్నాడు. 


బాహుబలి సినిమాలో ప్రభాస్ నటనకు సాహోలో ప్రభాస్ నటనకు చాలా తేడా ఉంది. సాహోలో అశోక్ చక్రవర్తిగా.. సాహోగా రెండు వేరియేషన్స్ లో ప్రభాస్ ఎందుకో సరిగా చేయలేకపోయాడు. సాహో కచ్చితంగా బాహుబలి పరువు తీసేలా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ప్రభాస్ ఇక మీదట కథల విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం కెరియర్ రిస్క్ లో పడాల్సి వస్తుంది. 
బాహుబలి చూశారు కదా అని సాహో ఎలా ఉన్నా చూస్తేస్తారు అన్న పంథాలో సినిమా ఉంటుంది. అయితే ప్రేక్షకులు తెలివైన వాళ్లని ఎవరు మోసం చేయలేరు. 




మరింత సమాచారం తెలుసుకోండి: