అతివిశ్వాసం ప్రమాదకరం అని అంటుంటారు పెద్దలు. అది అప్పుడు అర్ధం కాలేదు .. కానీ ఇప్పుడు సాహూ చూశాక నిజమే వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం అని అనిపిస్తుంది. భారీ బడ్జెట్, పెద్ద స్టార్ హీరో, ఆ సినిమా వస్తుంది అంటే చిన్న సినిమాలు అన్ని రిలీజ్ ని పోస్టుపోన్ చేసుకున్నాయి. ఇంకా అభిమానులైతే సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా హీరో సినిమా అని భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. 


సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, థియేటర్స్ అన్ని ఫుల్ ఉంటాయి ముందే టికెట్లు బుక్ చెయ్యండి అని ఫ్యాన్స్ అంత అనుకున్నారు. అలానే చేసుకున్నారు. తీరా సినిమా హాల్లోకి వెళితే తెలిసింది. సినిమాలో యాక్షన్, రొమాన్స్ తప్ప ఇంకా ఎం లేదు అని. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు కథ లేదు.. ఇంకేముంది మన పెద్ద స్టార్ కథ పాతాళానికి చేరింది. 


అదే మన బాహుబలి స్టోరీ. రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో ప్రభాస్ స్టార్ ఎక్కడికో వెళ్ళింది. దీంతో వచ్చే సినిమా బాహుబలిని మించి ఉంటుంది అనుకున్నారు. కానీ అక్కడే పప్పులోకి కాలు వేసాడు ప్రభాస్. ఒకే ఒక సినిమాతో దర్శకుడు అయ్యాడు సుజిత్. చిన్న దర్శకుడుని తీసుకొచ్చి పెద్ద హిట్ కొడుతా అంటే సినిమా అయినా ఎలా ఒప్పుకుంటుంది. 


అది కూడా భారీ బడ్జెట్ తో సినిమాని దాదాపు రెండేళ్లు కష్టపడి సినిమాని తెరకెక్కించారు. కానీ ఎం చేస్తాం ఆ కష్టానికి తగ్గ కథ లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు హర్ట్ అయ్యారు. సినిమా ఫట్టనింది. అందుకే ఎవరైనా సినిమా తియ్యాలి అనుకుంటే ముందు మంచి కథని ఎంచుకోండి. బడ్జెట్ ని కాదు. డబ్బు భారీగా పెడుతున్నాం ఏలాంటి సినిమా అయినా చూస్తారు అని అనుకున్నారో.. సాహూ గతే పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: