శ్రీమంతుడు సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబు మార్కెట్ ఒక్క‌సారిగా సౌత్ ఇండియా రేంజ్‌కు వెళ్లిపోయింది. ఓ వైపు థియేట‌ర్ల‌లో బాహుబ‌లి 1 హంగామా న‌డుస్తుండ‌గానే రిలీజ్ అయిన శ్రీమంతుడు నాన్ బాహుబ‌లి రికార్డుల‌కు పాత‌రేసేసింది. ఆ వెంట‌నే మ‌హేష్ వెన‌కా ముందు ఆలోచించ‌కుండా త‌న‌కు సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చాడ‌ని క‌నీసం క‌థ కూడా విన‌కుండా శ్రీకాంత్ అడ్డాల‌కు బ్ర‌హ్మోత్స‌వం ఆఫ‌ర్ ఇచ్చేశాడు.


బ్ర‌హ్మోత్సవం షూటింగ్ సగం జ‌రిగాక కాని మ‌హేష్‌కు తెలియ‌లేద‌ట‌. క‌థ ఇంకా రెడీ కాలేద‌ని.. అప్పుటికే చేయాల్సింది అయిపోయింది. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది... సినిమా ప్లాప్ అని మ‌హేష్‌కు అర్థం అయ్యింది. కానీ చేసేదేం లేక ఆ సినిమాను మ‌మః అనిపించేశాడు. సినిమా ఘోరాతి ఘోర‌మైన ప్లాప్ అయ్యింది. మ‌హేష్‌బాబు ప‌రువును నిలువునా తీసేసింది. ఆ సినిమాతో మ‌హేష్‌ను సోష‌ల్ మీడియాలో ఇత‌ర హీరోల అభిమానులే కాదు... మ‌హేష్‌ను విప‌రీతంగా అభిమానించే వాళ్లు కూడా ఓ ఆటాడుకున్నారు. ఆ త‌ర్వాత మ‌హేష్ కాస్త వెన‌కా ముందు చూసుకుని క‌థ‌లు ఎంచుకుంటున్నాడు.


కట్ చేస్తే బాహుబ‌లి 1,2 ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌నే మార్చేశాయి. దాని వెన‌క ప్ర‌భాస్ ఒక్క‌డే కాదు రాజ‌మౌళితో పాటు చాలా మంది క‌ష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అంత‌మాత్రానా అదంతా నా క్రెడిట్ అనుకుంటే కుదురుతుందా ?  నాడు మ‌హేష్ చేసిన బ్లండర్ మిస్టేక్ నేడు ప్ర‌భాస్ చేశాడు. త‌న హోం బ్యాన‌ర్‌లో ర‌న్ రాజా ర‌న్ లాంటి హిట్ ఇచ్చాడ‌ని సుజిత్ చెప్పిన క‌థ‌కు ఓకే చెప్పేశాడు. ఆ క‌థ‌లో ద‌మ్ము ఎంత ?  దానిని డీల్ చేసే స‌త్తా సుజిత్‌కు ఉందా ?  లేదా ? అన్న‌ది ఆలోచించ‌లేదు.


త‌న‌కు బాహుబ‌లి మార్కెట్ ఉంది... సుజిత్‌కు ర‌న్ రాజా ర‌న్ హిట్ ఉంది.. యూవీ క్రియేష‌న్స్ టాప్ బ్యాన‌ర్ డ‌బ్బులు గ‌ట్టిగా పెడ‌తారులే అని సాహో ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు రిజల్ట్ చూస్తే బ్ర‌హ్మోత్స‌వం సీనే రిపీట్ అయ్యింది. బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ రోజున బ్ర‌హ్మోత్స‌వంతో పాటు మ‌హేష్‌ను, డైరెక్ట‌ర్ శ్రీకాంత్‌ను ఇత‌ర హీరోల అభిమానులు, నెటిజ‌న్లు ఎలా ? ఆడుకున్నారో ఈ రోజు సాహో విష‌యంలోనూ అదే సేమ్ రిపీట్ అవుతోంది. 


బ్ర‌హ్మోత్స‌వం అంటే మ‌హేష్ అభిమానులే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు సాహో విష‌యంలోనూ అదే రిపీట్ అవుతోంది. సాహో బ్యాడ్ టాక్ చూసి ప్ర‌భాస్ అభిమానులే త‌ట్టుకోలేక‌పోతున్నారు. కొత్తదనం లేని కథ,కథనాలు, ఇంట్రస్ట్ లేని మరియు అనవసరమైన సన్నివేశాలు వల్ల సినిమా ఫలితం దెబ్బ తింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: