రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో సినిమా విపరీతమైన అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ నుండి, నిన్న మొన్నటివరకు తారా స్థాయికి ప్రేక్షకుల మదిలో అంచనాలు నింపిన సాహో సినిమా, నేడు రిలీజ్ తరువాత వారికి ఊహించని షాక్ ని ఇచ్చింది. మొదటగా నిన్న రాత్రి యుఎఈ నుండి వెలువడిన ఈ సినిమా ప్రీమియర్ షోకు కాస్త మిక్స్డ్ గానే టాక్ రావడం జరిగింది. అయితే నేడు తెల్లవారుఝాము నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో షోలు పడ్డాయి. ఇక సినిమా చూసిన ప్రేక్షకుల్లో మెజారిటీ ప్రేక్షకులు, ఈ సినిమాపై పెదవి విరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత రానున్న ప్రభాస్ సినిమా కావడం, 

అలానే రూ.350 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అవడంతో, తాము సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం అని, ఇక టీజర్ , ట్రైలర్ తో ఆ అంచనాలు ఆకాశమే హద్దుగా ఏర్పడ్దయని, కానీ తీరా థియేటర్ లో సినిమా చూస్తే మాత్రం, మాకు పూర్తిగా నిరాశ కలిగింది అనేది ప్రేక్షకులు చెప్తున్న మాట. సినిమాలో విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి అవసరం ఉన్నా, లేకున్నా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కనపడతాయని, కథ, కథనాలపై దర్శకుడు అస్సలు దృష్టిపెట్టలేదని అంటున్నారు. ఇక  సినిమాలో కొన్ని పాత్రలు అయితే ఎందుకు వస్తున్నాయో, ఎందుకు వెళ్తున్నాయో కూడా అర్ధం కాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలు అస్సలు లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అని అంటున్నారు. 

అలానే గజిబిజి గందరగోళంగా వచ్చే యాక్షన్ సీన్స్, ముఖ్యంగా పనిగట్టుకుని మరీ హీరో క్యారెక్టర్ ను మరింతగా పైకి లేపి చూపించేలా బిల్డప్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి సినిమాకు నష్టం చేకూర్చాయని, ఇక హీరో మరియు హీరోయిన్ల మధ్య వచ్చే రొటీన్ రొమాంటిక్ సీన్లు, పరమ బోరింగ్ గా విసిగించే పాటలు సాహోకు అతి పెద్ద మైనస్ గా చెప్తున్నారు. ఇక మొత్తంగా అతి పెద్ద గజిబిజి గందరగోళంగా తెరకెక్కిన ఈ సాహోకు ప్రేక్షకుల నుండి అప్పుడే పూర్తిగా ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అవడంతో, బయ్యర్ల గుండెల్లో తీవ్రంగా గుబులు పుడుతోందట. నిన్న రాత్రి వరకు సినిమా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని భావించిన వారికి, నేడు ఈ అతి పెద్ద షాక్ తో చాలా చోట్ల తాము పెట్టిన పెట్టుబడైనా వస్తుందా అనే రీతిలో వణుకు పుడుతోందట..మరి వారికి రాబోయే రోజుల్లో సాహోతో ఎంతమేర నష్టం జరుగుతుందో వేచి చూడాలి...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: