ఓ సినిమాపై అంచనాలు ఆయా హీరోను బట్టి, కాంబినేషన్ బట్టి పెరిగిపోతూంటాయి. ఫలితాలు ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, హిట్, ఫ్లాప్, డిజాస్టర్ ల రూపంలో వస్తూంటాయి. ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చిన ఏ హీరో కూడా తర్వాత చేసిన సినిమా ఏదీ హిట్ కాలేదు. ఈరోజు విడుదలైన ప్రభాస్ సాహో కూడా ఇదే దారిలో వెళ్తోందని ఇప్పటికే వచ్చిన టాక్ చెప్తోంది. చిరంజీవి మాత్రమే అలాంటి రేర్ ఫీట్ సాధించారు. ఇంద్ర తర్వాత అదే స్థాయి ఇండస్ట్రీ హిట్ గా ఠాగూర్ ఇవ్వగలిగారు.

 

చిరంజీవి : ఘరానామొగుడు - ఆపద్భాందవుడు (1992)


బాలకృష్ణ : సమరసింహారెడ్డి – భలేవాడివి బాసూ (1999), నరసింహనాయుడు – సీమసింహం (2001)


నాగార్జున : శివ – జైత్రయాత్ర (1990)


వెంకటేశ్ : చంటి – చినరాయుడు (1992)


మోహన్ బాబు : పెదరాయుడు – సోగ్గాడి పెళ్లాం (1995)


పవన్ కల్యాణ్ : ఖుషీ – జానీ (2001-2003) అత్తారింటికి దారేది – గోపాల గోపాల (2013-2015)


మహేశ్ బాబు : పోకిరి – సైనికుడు (2006-2007), శ్రీమంతుడు – బ్రహ్మోత్సవం (2015-2016)


రామ్ చరణ్ : మగధీర – ఆరెంజ్ (2009-2010)


జూ.ఎన్టీఆర్ : సింహాద్రి – ఆంధ్రావాలా (2003-2004)


ప్రభాస్ : బాహుబలి 2 – సాహో (2017-2019)


ఇలా ఏ ఇండస్ట్రీ హిట్ తీసుకున్నా తర్వాత వచ్చిన సినిమా ఏదీ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. బ్లాక్ బస్టర్ సినిమాల పరిస్థితి కూడా ఇంతే. ఇదంతా కేవలం ముందు సినిమాపై వచ్చిన క్రేజ్ కు అనుగుణంగా వస్తూంటాయి. అంతపెద్ద హిట్ తో సేఫ్ జోన్ లో ఉండాలన్న తాపత్రయంలో ఇలా ఫ్లాపుల బారిన పడుతూంటారు. ప్రస్తుతం సాహో విషయంలో కూడా ఇదే జరిగి ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: