యువి క్రియేషన్స్ టాలీవుడ్లో వరుసగా విజయాలు అందుకొంటున్న బ్యానర్లలో ఇది కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాతో యువి క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా తరువాత శర్వానంద్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రన్ రాజా రన్ సినిమా తీసారు. ఈ సినిమా కూడా హిట్టైంది. 
 
గోపీచంద్ జిల్, గీతా ఆర్ట్స్ భాగస్వామ్యంతో భలే భలే మగాడివోయ్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు, గీతా ఆర్ట్స్ భాగస్వామ్యంతో ట్యాక్సీవాలా, భాగమతి సినిమాలను నిర్మించారు. ఈ సినిమాలన్నీ యువి క్రియేషన్స్ కు సక్సెస్ ఇచ్చాయి. పాకెట్ సినిమా బ్యానర్ తో కలిసి తీసిన హ్యాపీ వెడ్డింగ్ మాత్రమే ఫ్లాప్ అయింది. ఇలా వరుస సక్సెస్ లు అందుకుంటున్న యువి క్రియేషన్స్ బ్యానర్ కు సాహో రూపంలో పెద్ద షాకే తగిలింది. 
 
సాహో సినిమా కోసం 350 కోట్ల రుపాయలు ఖర్చు పెట్టారు యువి క్రియేషన్స్ నిర్మాతలు. చాలా ఏరియాలను అమ్మగా కొన్ని ఏరియాలను మాత్రం స్వంతంగా విడుదల చేసుకున్నారు. సాహో సినిమాకు ప్రేక్షకుల నుండి బిలో యావరేజ్ టాక్ వస్తుంది. ఈ టాక్ తో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుందో ఇప్పుడే చెప్పలేము. కానీ ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం భారీ స్థాయిలో నష్టాలు మాత్రం ఖాయమని తెలుస్తోంది. 
 
బాలీవుడ్లో కూడా ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ సినిమాకు 1.5 రేటింగ్ ఇచ్చాడు. బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ ఎక్కడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపించటం లేదు. వీకెండ్ వరకు సాహో సినిమా కలెక్షన్లకు ఏ సమస్య లేకపోయినా వీకెండ్ తరువాత ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: