ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సాహూ ఫివర్ పట్టుకుంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సాహో పై అంచనాలు ఆకాశాన్ని తాకేసాయి.  బాహుబలి రిలీజ్ కాకముందే ఈ సినిమాకి కమిట్ అయినప్పటికీ బాహుబలి తో ప్రభాస్ నేషనల్ హీరోగా మారిపోవడంతో 150 కోట్ల బడ్జెట్ ని 350 కోట్లకి పెంచేశారు. ఇదే ఇప్పుడు సాహో చిత్ర యూనిట్ చేసిన అతిపెద్ద తప్పులా అందరికి అనిపిస్తుంది. ఒకసాధారణ కథని తీసుకోని , హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకేక్కించారు. 

కానీ , సినిమాలో అసలు కీలకమైన కథపై ద్రుష్టి పెట్టలేకపోయారు. కేవలం హాలీవుడ్ రేంజ్ సినిమా,హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ఆకాశాన ఉన్న ప్రభాస్ స్టార్ డమ్ ని నేలకి దించేశారు. మొత్తంగా ఈ సాహో ప్రభాస్ కెరియర్లోనే బిగెస్ట్ ప్లాప్ దిశగా పరుగులు పెడుతుంది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం లో ఉండిపోయారు బాహుబలి రేంజ్ లో  సినిమా ఉంటుంది అని అనుకుంటే కనీసం ఒక మాత్రం కూడా లేకపోవడంతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు.ఇకపోతే టాలీవుడ్ లో రివ్యూస్ కొద్దిగైనా పర్వాలేదు కానీ , బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ గా నిలిచే అవకాశముంది అని అక్కడి రివ్యూ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. 

ఇక అసలు విషయంలోకి వెళ్తే ...ఈ ఏడాదిలో భారీ బడ్జెట్ చిత్రాలలో సాహో , సైరా అగ్ర స్థానంలో ఉన్నాయి. మెగాస్టార్ నటిస్తున్న సైరా నరసింహారెడ్డిని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సుమారుగా 200  కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా కొంచెం ఓవర్ బడ్జెట్ తో రూపొందుతుంది. అలాగే చరిత్ర నేపథ్యం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే 200 కోట్లు సైరా కి చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి.  ఏమాత్రం తేడా కొట్టినా కూడా భారీగా నష్టాలు వస్తాయి. 

ఇప్పటికే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సాహో ఘోర పరాజయాన్ని మూటగట్టుకునేలా ఉండటం తో ప్రమోషన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసి , సినిమా రెసుల్త్ పై దెబ్బ కోతకండి అంటూ మెగా అభిమానులు సూచనలు ఇస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ నిన్నటివరకు ఊదరగొట్టిన సాహో కి ఎదురైనా ప్రభావం సైరా కి ఎదురుకాకూడదంటూ ఆ దేవుడిని కోరుకుంటున్నారు. అలాగే సైరా ని ఎట్టిపరిస్థితిలో కూడా మరో సాహో చేయద్దు అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి సైరా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమేర విజయం సాధిస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: