టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళ్ లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొంది, సూపర్ హిట్ సొంతం చేసుకున్న జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, 

గోపి ఆచంట నిర్మాతలుగా నిర్మిస్తున్న ఈ సినిమా కు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఒక సాంగ్, సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి. వరుణ్ తేజ్ తొలిసారి పక్కా మాస్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక సాంగ్ చిత్రీకరిస్తున్నారని, అయితే అది గతంలో సోగ్గాడు శోభన్ బాబు, శ్రీదేవి కలయికలో వచ్చిన దేవత సినిమాలోని 'వెల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ అని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ సాంగ్స్ ని రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ తమ సినిమాల్లో రీమిక్స్ చేయగా, 

ప్రస్తుతం వరుణ్ వాల్మికీ లో, శోభన్ బాబు గారి సాంగ్ రీమిక్స్  చేస్తుండడంతో, సినిమాలో ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఉత్సాహం మొదలైంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా నిజంగానే వాల్మీకిలో ఆ సాంగ్ రీమిక్స్ చేస్తున్నారా అనేదానిపై ఆ
సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉందని, అప్పటివరకు ఈ వార్తను నమ్మలేం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా సెప్టెంబర్ 13న రిలీజ్ కావలసిన ఈ సినిమా, అదే రోజున నాని నటించిన గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవుతుండడంతో, వారం వాయిదాపడి ఎట్టకేలకు సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: