సాధారణంగా సెలబ్రెటీలు అంటే జనాల్లో కాస్త క్యూరియాసిటీ ఉంటుంది. నటీ, నటులు ఎక్కడైనా కనిపిస్తే వారిని గౌరవించడం..వారితో సెల్ఫీలు తీసుకోవాలని ఉబలాటపడటం జరుగుతుంది. కొంత మంది నటులు సహనంతో అభిమానుల కోర్కెలు తీరుస్తారు..మరికొంత మంది నటులు బిజీ అంటూ అక్కడ నుంచి తప్పించుకుంటారు.  తాజాగా ఓ నటుడు మాత్రం తన పిచ్చి పనులతో జనం చేతిలో తన్నులు తిన్నాడు.  వివరాల్లోకి వెళితే.. కన్నడంలో నటుడిగా,  రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా  పేరు తెచ్చుకున్నారు హుచ్చా వెంకట్.  సినీ సెలబ్రెటీ అయినా వెంకట్ మాత్రం ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్రంగా ఉంటూ వస్తున్నారు. 

కన్నడలో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌-3లో పాల్గొన్నారు.  ఆ సమయంలోఅతనిపై ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి.  తాజాగా కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఓ హోటల్ కు వెళ్ళాడు.  వెంకట్ సెలెబ్రిటీ కావడంతో అక్కడున్నవారు అతడిని చూసేందుకు, పలకరించేందుకు వచ్చారు. కానీ ఆయన ప్రవర్తన మాత్రం అందరినీ ఆశ్చర్య పరిచింది. కేఎస్‌ఆర్టీసీ ఎదుట నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. అతని ప్రవర్తన చూసిన స్థానికులు నిలదీశారు. మాట వినకపోయేసరికి పట్టుకుని చితకబాదారు.

విషయం తెలిసి స్థానిక మీడియా వర్గాలు అక్కడి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ గొడవకు సంబంధించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని వెంకట్ ని అరెస్ట్ చేశారు. వెంకట్ కన్నడ బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నాడు. గతంలో కూడా ఆయనపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయినా కూడా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావడంలేదు.  సెలబ్రెటీలని ఫ్యాన్స్ ఎంతగానే అభిమానిస్తుంటారు..కానీ ఇలాంటి వారి వల్ల సెలబ్రెటీల సిగ్గు పోతుందని శాండిల్ వుడ్ ఇంటస్ట్రీలో పలువురు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: