స్టార్ సినిమా అంటే అసలు కథ ఎలా ఉన్నా మిగిలిన కమర్షియల్ అంశాల మీద మాత్రం దర్శకుల గురి ఉంటుంది. కథ కాస్త అటు ఇటుగా ఉన్నా పర్లేదు కాని స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా బిల్డప్ లేకపోతే మాత్రం బాగోదని అనుకుంటారు. అందుకే లేనిపోని బిల్డప్పులతో నానా హంగామా చేసి సినిమాకు కావాల్సిన బడ్జెట్ కన్నా రెండు మూడు రెట్లు చేస్తారు.


భారీ బడ్జెట్.. భారీ స్టార్ కాస్ట్ ఉంటే ఆటోమెటిక్ గా సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆ అంచనాలను ఏమాత్రం అందుకోకపోయినా సినిమా నిరాశపరచినట్టే. ఈరోజు వచ్చిన సాహో పరిస్థితి కూడా ఇదే. సినిమాలో అసలు కథ కన్నా మిగిలిన అంశాలు మాత్రం బాగా ఉన్నాయి. ఉండాల్సింది లేకుండా ఎన్ని ఉండి ఏం లాభం అంటూ సినిమా చూసిన ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు.  


సినిమాలో హీరో ఒక్కడే కాని విలన్ సామ్రాజ్యం చాలామంది. పృద్వి రాజ్ తర్వాత గ్యాంగ్ స్టర్ అధిపతిగా ఉంటాడు రాయ్. సిండికేట్ తో ఉంటున్నా రాయ్ ను తొలగించి ఆ స్థానంలో తను ఉండాలని చూస్తాడు దేవరాజ్. ఇక రాయ్ కొడుకుగా విశ్వక్.. దేవరాజ్ కు సీక్రెట్ ఏజెంట్ గా విశ్వక్ దగ్గర ఉండే కల్కి. రాయ్ కు నమ్మిన బంటుగా ఉండే మరో నటుడు. దేవ రాజ్ కు అన్నివేళలా కుడిభుజంగా ఉండే ప్రిన్స్.. వీరితో పాటుగా అశోక్ చక్రవర్తిగా నటించిన నీల్ నితిన్ ముఖేష్ ఇలా అందరిని బాగా సెట్ చేశారు. ఇక ఫైనల్ ఫైట్ లో వందల మంది వస్తారు. ఇవే సాహో బడ్జెట్ పెంచాయని చెప్పొచ్చు. అబుదాబిలో తీసిన యాక్షన్ సీన్ బాగుంది.    


వీళ్లే కాదు తెలుగు నటులకు సాహోలో స్థానం కల్పించారు. కాని అది జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లే సన్నివేశాలే అని చెప్పొచ్చు. ఇంత స్టార్ కాస్ట్ పెట్టి ఇంత భారీతనంతో తీసి పోని ఏదైనా గొప్ప కథ చెప్పారా అంటే ఆల్రెడీ తెలుగులో వచ్చిన కథతో సాహో తీశారు. యాక్షన్ పార్ట్ వరకు ఓకే కదా అనిపించినా సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియెన్స్ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.   
   


మరింత సమాచారం తెలుసుకోండి: