అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని ఘనంగా చాటాడు నాగార్జున. యువ సామ్రాట్ నుంచి కింగ్ నాగార్జునగా అభిమానుల ఆదరాభిమానాలను అందుకున్నాడు. వయసు అరవైకి దగ్గర్లో ఉన్నా తన స్మార్ట్ లుక్స్ తో ఇప్పటికీ టాలీవుడ్ నవ మన్మథుడుగా అలరిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన మన్మథుడు 2 చూస్తేనే నాగ్ గ్లామర్ ఏంటో అర్థమవుతుంది. సినిమా ఫలితమెలా ఉన్నా నాగ్ లుక్ అదుర్స్. ఆగష్టు 29న నాగ్ బర్త్ డే సందర్భంగా తన వెకేషన్ ఫోటోలను కోడలు సమంత తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది.


 

నాగ్, అమల, చైతూ, అఖిల్ తో ఉన్న గ్రూప్ ఫోటోను, నాగ్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి మామ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా ఎంజాయ్ చేసామని చెప్పకనే చెప్పింది. ఫ్యామిలీ అంతా చూడచక్కటి ఫిట్ నెస్ తో.. ఫిట్ నెస్ కే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ సందర్భంగా సమంత తన ఇన్ స్టా వాల్ లో “మీచుట్టూ ఉండే వ్యక్తులకు సంతోషాలను పంచుతుంటే ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటాను. మీ మంచి మనసుతో, వినూత్నమైన ఆలోచనలతో సంతోషాన్నిస్తూంటారు. మీరు వయసును జయిస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. రాబోయే తరాలకు కూడా మీరు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా” అని రాసుకుంది. మీ అందరి ప్రేమాభిమానులకు సంతోషంగా ఉంది.. కృతజ్ఞతలు అని కూడా రాసుకుంది.

 


ఫ్యామిలీ మొత్తం ఉన్న ఈ పిక్స్ చూసి అక్కినేని అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. నాగ్.. హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్స్ చేశారు. నాగ్.. బంగార్రాజు, చైతన్య శేఖర్ కమ్ముల, అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే వీరు షూటింగుల్లో జాయిన్ కానున్నారు.


View this post on Instagram

About last night 💓

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

మరింత సమాచారం తెలుసుకోండి: