బిగ్ బాస్ సీజన్ 3 లో మరోవారం ముగిసింది. ఇక వీకెండ్ లో హోస్ట్ నాగార్జున వచ్చి అలరించనున్నాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ చాలా చప్పగా సాగింది. ఇకపోతే 41 వ ఎపిసోడ్ హైలెట్స్ విషయానికొస్తే .... బిగ్ బాస్ హౌస్లో  అల్లరి చేష్టలతో బాబా భాస్కర్‌ మరోసారి హౌస్ ని సందడిగా మరికాయాడు. చలో ఇండియా టాస్క్‌లో బెస్ట్‌ పర్ఫామెన్స్‌గా రాహుల్‌, వరుణ్‌లను ఎంచుకోవడంతో  హౌస్ మేట్స్ పై  సెటైర్లు వేశాడు. పునర్నవి, రవి, రాహుల్‌ బెస్ట్‌ పర్ఫామెన్స్‌లుగా చెప్పుకొచ్చిన చెప్పాడు. ఇక నేనుహౌస్‌లో కెప్టెన్‌ అయితే ఆడవారు పొద్దున్నే లేవాలని, పొట్టి డ్రెస్సులు వేసుకోకూడదని, అలీరెజా కూడా బాత్రూమ్‌కు వెళ్లే ముందు దుప్పటి తీసుకెళ్లాలనే ఆదేశాలు జారీ చేస్తానని బాబా చెప్పాడు.
 
ఇక  మొదటిసారి కెప్టెన్‌ టాస్క్‌ వెళ్లబోతోన్నావు కెప్టెన్‌గా ఎన్నికైతే బయట నీ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేస్తారు, రక్తాభిషేకాలు చేస్తారు అని సరదాగానే శ్రీముఖి అన్నప్పటికీ   రాహుల్‌ మాత్రం కాస్త ఫీలైనట్లు అనిపించింది. చివరకు కెప్టెన్‌ పోటీలో రాహుల్ ఓడిపోయాడు.ఇక  బురదలో సాగిన కెప్టెన్సీ టాస్క్ కొద్దిసేపు అందరిని అలరించింది అని చెప్పవచ్చు.   ముగ్గురిని ఒకే తాడుతో బంధించగా, ఇద్దర్నీ వారి బుట్టల్లో బంతులను వేయకుండా నిరోధిస్తూ మిగిలిన వ్యక్తి బంతులను వేయాల్సి ఉంటుంది.

ఇలా ఎండ్‌ బజర్‌ మోగే వరకు ఎవరి బుట్టల్లో ఎక్కువ బంతులుంటాయో వారే కెప్టెన్‌గా ఎన్నికవుతారని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రాహుల్‌, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌లు ఒకర్నొకరు తోసుకుంటూ బంతులు వేసేందుకు ప్రయత్నించారు. చివరకు వరుణ్‌ సందేశ్‌ 27, బాబా భాస్కర్‌ 13, రాహుల్‌ 15 బంతులు వేశాడు. దీంతో వరుణ్‌ సందేశ్‌ రెండో సారి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.
 ఆ తరువాత బిగ్ బాస్ ఈ వారం  లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ చాలా  ఫన్నీగా ఇచ్చాడు. 

గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన వీల్‌ కు కెప్టెన్‌ అయిన వరుణ్‌ సందేశ్‌ను కట్టి.. అతని చుట్టు ఇంటికి కావాల్సిన సరుకుల లిస్ట్‌ పెట్టాడు. ఇక హౌస్‌ మేట్స్‌ అందరూ తమకిచ్చిన రంగుల బంతులతో గురి చూసి కొట్టాలి. గురిచూసిన కొట్టిన సరుకులను లగ్జరీ బడ్జెట్‌లో లభిస్తాయని, అలాగే చలో ఇండియా టాస్క్‌లో భాగంగా గెలిచిన ఇంటి సభ్యులైన రవి, మహేష్‌, బాబా భాస్కర్‌, అలీరెజాకు రెండేసి సరుకులను ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. గురి చూసి కొట్టేందుకు ఇంటి సభ్యులంతా చాలా కష్టపడ్డారు. ఇక ఈ వీకెండ్‌లో నాగ్‌  వచ్చి ఎవరిని హౌస్ నుండి బయటకి తీసుకోని వస్తాడో తెలియాలి అంటే వేచి చూడక తప్పదు ...


మరింత సమాచారం తెలుసుకోండి: