ఎన్నో అంచనాలు.. మరెన్నో అద్భుతాలు.. వెరసి సాహో సినిమా భారీ హిట్ అందుకుంటుందని అందరూ ఊహించారు.  ప్రచారం జోరును చూసి.. మరో బాహుబలి వచ్చేసిందని సంబరాలు చేసుకున్నారు.  టీజర్, ట్రైలర్ అన్ని చూసి అబ్బో, ఓహో అదరహో అనుకున్నారు.. తీరా థియేటర్ కు వెళ్లిన తరువాత చూస్తే.. బాబోయ్ ఇదేం సినిమా.. దీనికోసం ఇంత హంగామా చేశారా.. ఇంతటి ఖర్చు పెట్టి సినిమా తీశారా అని షాక్ అవుతున్నారు.  అసలేం జరిగింది.  సాహో పరాజయానికి కారణాలు ఏంటి.  హైప్రచారం కారణంగానే సాహో పరాజయం పాలైందా లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా.. చూద్దాం.  


ప్రభాస్ సాహో సినిమా ప్రారంభం హైబడ్జెట్ అనుకోలేదు.  మాములు యాక్షన్ సినిమాగా తీయాలని అనుకున్నారు.  అనుకున్నట్టుగా అలానే తీసుంటే.. ఫలితం ఈరోజు వేరుగా ఉండేది.  కానీ, సినిమాను ఎప్పుడైతే.. పాన్ ఇండియా అని అదరగొట్టి.. బడ్జెట్ అమాంతం పెంచి విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో సినిమాను భారీగా తెరకెక్కించారు.  ఇదే సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది.  అంతేకాదు, ప్రభాస్ యాక్షన్ సినిమాలు బాగానే చేస్తారు.. అదే సమయంలో సినిమాలో డ్రామా కూడా ఉండాలి.  


ఇందులో ఆ డ్రామా కరువైంది.  ఎక్కడ వెతికినా ఆ డ్రామా కనిపించదు.  అసలు సినిమాలో ఏం రన్ అవుతుందో తెలియక తికమక పడ్డారు.  కథ లేకుండా కేవలం యాక్షన్ ను మాత్రమే నమ్ముకొని సినిమా తీస్తే ఇలానే ఉంటుంది.  అందుకే సినిమా తీసే సమయంలో తప్పకుండా కథను దృష్టిలో పెట్టుకోవాలి.  కథను దృష్టిలో పెట్టుకొని కథనాలు రాసుకోవాలి.  అంతేకాదు, భారీ క్యాస్టింగ్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా కథనాలు ఉండాలి.  


హాలీవుడ్ సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే కారణాలు చాలా ఉన్నాయి.  కథ, కథనాల విషయంలో వారు తీసుకునే శ్రద్ద అలా ఉంటుంది.  కథనాలు పక్కాగా ఉంటాయి.  యాక్షన్ ఎంత ఉన్నా అందులో ప్రేక్షకులకు నచ్చే డ్రామా తప్పనిసరిగా ఉంటుంది.  అందుకే హాలీవుడ్ సినిమాలు హిట్ అవుతుంటాయి.  బాలీవుడ్ లో వచ్చిన పక్కా యాక్షన్ మూవీ టెర్మినేటర్ సినిమాలో కూడా ఇలాంటి డ్రామానే ఉంటుంది.  అందుకే ఆ సీరీస్ లో ఎన్ని సినిమాలు వచ్చినా సూపర్ హిట్ అవుతున్నాయి.  అవతార్ సినిమా కూడా అంతే.  ప్రేక్షకులను కథలోకి లీనం అయ్యేలా ఉండే కథనాలు సినిమాలో ఉండాలి.  అప్పుడే సినిమా ఒకరేంజ్ లో ఉంటుంది.  లేదంటే ఇలానే ఉంటుంది.  ఇప్పటికైనా ప్రభాస్ కథను నమ్మి.. కథనాలను ఒకటికి పదిసార్లు చూసుకొని సినిమా చేస్తే బాగుంటుంది.  లేదంటే ఇలానే ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: