ఏదైని సినిమా నిర్మించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది..కానీ ఆ సినిమా థియేటర్లో ముడు గంటల్లో హిట్టా..ఫ్లాపా అని ఒక్కసారే తేల్చేస్తారు.  గతంలో ఒక సినిమా పై టాక్ వినాలంటే వారం రోజులు పట్టేది..కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రిమియం షో పడ్డ మూడు గంటల్లోనే ఆ సినిమాపై రక రకాల రివ్యూలు రాయడం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ లో పడేయటం చూస్తూనే ఉన్నాం.  అయితే ఒక సినిమా వారం రోజుల తర్వాత అనూహ్యంగా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

గతంలో అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాలు బోల్డ్ కంటెంట్ ఉందంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ వారం తర్వాత ఆ మూవీస్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. పెట్టిన పెట్టుబడికన్నా భారీగా వసూళ్లు చేశాయి.  యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ నటించిన ‘సాహో’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పదివేల థియేటర్లలో రిలీజ్ అయ్యింది.  తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అయ్యింది. అయితే రిలీజ్ కు ముందు ఉన్న పాజిటివ్ బజ్‌తో  ఒక్కసారిగా మాయమైంది. అన్ని వైపుల నుంచి ఈ సినిమా డిజాస్టర్ అన్న టాక్ స్ప్రెడ్ అయ్యిపోయింది.  ఈ ఫ్లాప్ ఓ వర్గం వారికి  ఆనందంలో ముంచెత్తుతోందని కథనాలు వస్తున్నాయి. 

అయితే ‘సాహో’ మూవీ కోసం బాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.  దానికి కారణం బాహుబలి తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు బాలీవుడ్ స్టార్స్ కి పోటీగా తయారయ్యాడని అక్కడ టాక్ వినిపించింది. మరికొంత కాస్త ఉత్సాహం ఎక్కువై ఖాన్ ల రికార్డుల్ని కొట్టేయబోతున్నాడు అన్నారు. దాంతో అక్కడ ఖాన్స్  ఫ్యాన్స్ కారాలు మిర్యాలు రుయ్యబట్టారు. అయితే సాహో మూవీ ప్రమోషన్ సమయంలో ప్రభాస్ కి అక్కడ మీడియా ఎంతో కో ఆపరేట్ చేయడం కొంత మందికి నచ్చలేదు.

ఇది చాలా మంది బాలీవుడ్ స్టార్స్ అభిమానులకు మండేలా చేసింది. వాళ్లు సైలెంట్ గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.  నిన్న రిలీజ్ అయిన సాహో మూవీపై డిజాస్టర్ టాక్ రావడంతో  సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట.   బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమాని చెత్త సినిమా అంటూ తీసిపారేస్తున్నారు. ఇది  ఆక్కడి ఫ్యాన్స్ కు ఇంకా ఆనందాన్ని కలగచేస్తోందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: