టాలీవుడ్ లో తనదైన కామెడీ మార్క్ తో అందరి మనసు దోచిన సుధాకర్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి-సుధాకర్ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.  సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో సుధాకర్, చిరంజీవి, హరిప్రసాద్,  నారాయణమూర్తిలతో కలసి ఒకే గదిలో ఉన్నారు.  చెన్నైలో సినిమాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఏ చిన్న క్యారెక్టర్ వచ్చిన నటించే వారు. అదే సమయంలో  దర్శకుడు భారతీరాజాను కలవడం ఆయన సుధాకరును కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది. దాంతో సుధాకర్ తమిళనాట మంచి ఆదరణ లభించింది.

దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. ప్రముఖ నటి రాధికతో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరుతెచ్చుకున్నారు.  అదే సమయంలో అక్కడ కొన్ని రాజకీయాలు జరగడంతో తెలుగు సినీ పరిశ్రమకు వచ్చారు.  తెలుగులో ఇతడి మొదటి చిత్రము సృష్టి రహస్యాలు. సుధాకర్ కి పేరు తెచ్చిన సినిమాలు ఊరికిచ్చిన మాట, భోగి మంటలు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్, కమెడియన్ గా నటించారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకుల ముందు ఉంచారు. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు .. కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేవి. ఒక్కసారిగా వచ్చేసిన స్టార్ డమ్ తో తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. అదే సమయంలో ఎంజీఆర్ నుంచి నాకు పిలుపు వచ్చింది, కానీ నేను కమ్యూనీజం భావాలు కలవాడినని నేను మీతో కలవలేనని అన్నాను. నేను వాళ్ల పార్టీలో చేరలేదనే కోపంతో, నిర్మాణ దశలో వున్న నా సినిమాలన్నింటినీ ఆపేశారు.

దాంతో ఒక్కసారే ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో నాకు లైఫ్ ఇచ్చిన భారతీరాజా ఇక్కడ ఇలాంటి రాజకీయాలే ఉంటాయని..నువు తెలుగు సినీ పరిశ్రమలోకి వెళ్లు అక్కడ మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. అంతే ఏమీ ఆలోచించకుండా ఇక్కడకు వచ్చాను..ఇక్కడ నాకు ఎంతో మంచి సినిమాల్లో ఛాన్స్ వచ్చాయి..ఆర్థికంగా మళ్లీ ఎదగగలిగానని అన్నారుు. 


మరింత సమాచారం తెలుసుకోండి: