వరుస పరాజయాలతో ఢీలా పడ్డ యాక్షన్ అండ్ ఫ్యామిలీ హీరో గోపీచంద్ తమిళ కొత్త దర్శకుడుతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. కోలీవుడ్ ఫేమ్ తిరుని తెలుగుకు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘చాణక్య’ అనే స్పై థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు గోపీచంద్. 


మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.  ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం నేతృత్వాన‌ ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ షూటింగ్ విశేషాల‌ను అక్క‌డి లోక‌ల్ ఎల‌క్ట్రానిక్ మీడియా స్పెష‌ల్‌గా టెలికాస్ట్ చేయ‌డం విశేషం. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌. 


దాదాపు సగం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జరీనా ఖాన్ కీలకపాత్రలో నటిస్తోంది. ‘చాణక్య’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమా గోపీచంద్ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోనుందని.. ఇండో-పాక్ నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రానికి హైలెట్స్ నిలుస్తాయంటుున్నారు. ఈ సారైనా గోపీచంద్‌కి మంచి హిట్ రావాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.


గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి,  కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రైటర్: అబ్బూరి రవి, ఆర్ట్: రమణ వంక, కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్, పి.ఆర్.ఒ: వంశీ శేఖర్.


మరింత సమాచారం తెలుసుకోండి: