టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నానుడి ఉంది. అదేమిటంటే రాజమౌళితో సినిమా చేస్తే కచ్చితంగా హిట్ అవుతుంది కానీ ఆ సినిమాలో నటించిన హీరో తర్వాత చేయబోయే సినిమా ఇండస్ట్రీలో దారుణంగా ఫ్లాప్ అవుతుంది...ఇది గత కొంత కాలం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ లో వస్తున్న ట్రెండ్. దీంతో ఈసారి దెబ్బ ప్రభాస్ కి పడింది. రాజమౌళి అస్త్రం నుంచి సాహో సినిమా ద్వారా తప్పించుకోవాలని భారీ హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ ఉన్న స్క్రీన్ మీద ప్రభాస్ ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ని బాహుబలి గా చూసిన ప్రేక్షకులు సాహో సినిమాలో చూసిన ప్రభాస్ ప్రపంచ లేకపోయాడు. ఎన్ని కోట్లు పెట్టిన అంతగా రాణించలేకపోయాడు. రాజమౌళితో వచ్చిన తలనొప్పి ఇదే అని చాలామంది ఇండస్ట్రీలో రాజమౌళి తో పని చేసి హిట్ కొట్టిన హీరోలు అంటుంటారు.


ఇప్పటిదాకా హిట్స్ కొట్టి రాజమౌళితో కలిసి పని చేసిన చాలా మంది హీరోలు ఈ పరిస్టితిని ఎదుర్కొన్నారు. ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో 'స్టూడెంట్ నెంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాల తరువాత వచ్చిన 'సుబ్బు', 'ఆంధ్రావాలా', 'కంత్రి' సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.రాజమౌళి నితిన్ కాంబోలో వచ్చిన 'సై' సినిమా తరువాత నితిన్ హిట్టు కొట్టడానికి 'ఇష్క్' సినిమా దాకా ఎదురు చూడాల్సి వచ్చింది. అలాగే ప్రభాస్ కి అప్పట్లో చత్రపతి అంటే భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పౌర్ణమి అనే దారుణమైన డిజాస్టర్ వచ్చింది.


తర్వాత మాస్ మహారాజా రవితేజ కు విక్రమార్కుడు చేసిన తర్వాత ఖతర్నాక్ ద్వారా ఫ్లాప్ వచ్చింది. నానికు 'ఈగ' తరువాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు 'బాహుబలి 1', 'బాహుబలి 2' సినిమాల తరువాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. మొత్తంమీద రాజమౌళి డైరెక్షన్ దెబ్బకు ప్రభాస్ కి రెండో సారి భారీ దెబ్బ తగిలింది అని అంటున్నారు చాలామంది. సాహో సినిమా కోసం దాదాపు ప్రభాస్ రెండు సంవత్సరాలు కేటాయించడం కెరియర్ కి అతి పెద్ద దెబ్బ అనే కామెంట్స్ వినబడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: