‘సాహో’ మూవీకి విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ రావడంతో పాటు ఈ మూవీ పై మీడియా చాల నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం పై సుజిత్ తన తీవ్ర అసహనం వ్యక్త పరిచాడు. తాను ఈ సినిమా పై చాల మంది విమర్శకులు వ్రాసిన రివ్యూలు చూశానని ప్రతి వ్యక్తికి విమర్శించే హక్కు ఉన్నా ‘సాహో’ పై మితిమీరిన అత్యుత్సాహంతో ఎక్కువ విమర్శలు వచ్చాయని తాను అభిప్రాయ పడుతున్నట్లు సుజిత్ కామెంట్ చేసాడు. 

వాస్తవానికి తాను సినిమాల పై వచ్చే రివ్యూలు చూడనని అయితే ఊహించని  స్థాయిలో ఈమూవీ పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తనకు షాక్ ఇచ్చిన విషయాన్ని వివరించాడు. ప్రభాస్ నటించే ప్రతి సినిమాను ‘బాహుబలి’ తో పోలుస్తూ కామెంట్స్ చేస్తే ఏ దర్శకుడు ప్రభాస్ తో సినిమాను తీయలేడు అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

అంతేకాదు తనను రాజమౌళి స్థాయితో పోల్చవద్దని తాను ఎన్నో సార్లు మీడియాను అభ్యర్ధించినా ‘సాహో’ ను మరో ‘బాహుబలి’ గా పోలుస్తూ మీడియా విపరీతమైన అంచనాలు పెంచడంతో ‘సాహో’ కు సమస్యలు ఏర్పడ్డాయి అనీ సుజిత్ అభిప్రాయ పడుతున్నాడు. అయితే ప్రేక్షకులకు ‘సాహో’ నచ్చిందని ప్రేక్షకులకన్నా తన దృష్టిలో రివ్యూలు ఎక్కువ కావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ప్రభాస్ లాంటి గొప్ప హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఎవరికైనా తడబాటు ఉంటుందని ఆ విషయాలను గ్రహించకుండా ‘సాహో’ ను నెగిటివ్ కామెంట్స్ తో అల్లరి చేయడం ఎంతవరకు సబబు అంటూ సుజిత్ తన ఆక్రోసాన్ని తెలియచేస్తున్నాడు. మూడు సంవత్సరాల కష్టంతో ఒక భారీ సినిమాగా ‘సాహో’ ను సుజిత్ తీసిన విషయం వాస్తవమే అయినా ప్రతివ్యక్తి తాను వేసే ఓటుతో రాజకీయ పార్టీల భవిష్యత్ ను అదేవిధంగా కేవలం ఒకేఒక్కసారి సినిమా చూసి ఆ సినిమా పై చేసే కామెంట్స్ తో సినిమాల భవిష్యత్ నిర్ణయింపబడే పరిస్థితులలో సుజిత్ ఎంత వాదించినా అతడి మాటలు అరణ్యరోదనఅనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: