సాహో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అంచ‌నాలు లెక్క త‌ప్పాయి. అయితే మొదటి రోజు వసూళ్ల పరంగా నార్త్, ఓవర్సీస్ లో బాహుబలి-2ను క్రాస్ చేయలేకపోయింది. తెలుగు స్టేట్స్‌లో రెండు ప్రాంతాల్లో మాత్రం ఏకంగా బాహుబ‌లి 2 వ‌సూళ్ల‌నే బీట్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఆ రెండు ప్రాంతాల్లో నైజాం ఉండడం విశేషం. నైజాంలో సాహో ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌తో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. 


సాహోకు తొలి రోజు అక్క‌డ  9 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది. బాహుబలి-2 ఫస్ట్ డే కలెక్షన్ కంటే ఇది ఎక్కువ. నైజాంలో సాహో తొలి రోజు ఎక్కువ వ‌సూళ్లు సొంతం చేసుకోవ‌డానికి చాలా సానుకూల అంశాలే ఉన్నాయి. అక్క‌డ ఈ సినిమాను దిల్ రాజు పంపిణీ చేశారు. ఎక్కువ థియేట‌ర్ల‌లో సాహోను రిలీజ్ చేశారు. టిక్కెట్ల రేట్లు కూడా పెంచేశారు. బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్‌కు తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది.


ఆ అంశాల నేప‌థ్యంలోనే అక్క‌డ సాహో బాహుబ‌లి 2 రికార్డులు బీట్ చేసింది. ఫలితంగా సాహో సినిమా నైజాంలో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ఇక సినిమాల‌కు బిజినెస్ ప‌రంగా ఏపీలో చిన్న సెంట‌ర్ అయిన నెల్లూరు జిల్లాలో కూడా సాహో మొదటి రోజు వసూళ్లలో బాహుబలి-2ను అధిగమించింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్లు చూస్తే సాహో తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది.


ప్ర‌భాస్ గ‌తంలో బాహుబ‌లి 2 సినిమాకు కూడా తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించాడు. సౌత్ నుంచి ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన ఘ‌న‌త ప్ర‌భాస్‌కే ద‌క్కుతుంది. ఈ నెగెటివ్ టాక్ తో సాహో సినిమా బ్రేక్-ఈవెన్ అవుతుందా అన్న సందేహాలు చాలానే ఉన్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా సాహోను రూ. 319 కోట్ల‌కు అమ్మారు. మ‌రి ఈ వ‌సూళ్లు వ‌స్తాయా ?  లేదా ? అన్న‌ది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: