సక్సెస్ లకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే తెలుగు సినిమా ఇండస్ట్రీ.. మరో అంశానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అదే.. ‘సెంటిమెంట్’. కొన్ని కాంబినేషన్లు, టెక్నీషియన్లు, ముహూర్తాలు, లోకేషన్లు, ప్రారంభోత్సవాలు, రిలీజ్ లు సెంటిమెంట్ల మీదే నడుస్తాయి. యాక్టర్స్ నుంచి సూపర్ స్టార్ల వరకూ ఈ విషయాన్ని నమ్ముతారు. అలాంటి సెంటిమెంట్లు కొన్ని సినిమాల ఫలితాలలో కనిపిస్తున్నాయి.

 

 సాహో సినిమా మూలకథలో మెయిన్ క్యారెక్టర్ చేసిన జాకీ ష్రాఫ్ బాలీవుడ్ సీనియర్ నటుడు. కొన్నేళ్లుగా ఆయన క్యారెక్టర్ పాత్రలు చేస్తున్నాడు. జాకీ ష్రాఫ్ తెలుగులో నటించిన అస్ట్రం, శక్తి, పంజా డిజాస్టర్లు కాగా.. ఇప్పుడు ప్రభాస్ హీరోగా వచ్చిన క్రేజీయస్ట్ మూవీ సాహో కూడా ఈ డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఇదే తరహాలో పవన్ కల్యాణ్ ఖుషీ లో శివాజీ ఓ పాత్ర చేశాడు. ఈ సినిమా తర్వాత వరుస ఫ్లాపులు చూసిన పవన్ కు జల్సాతో సూపర్ హిట్ వచ్చింది. ఈ సినిమాలో కూడా శివాజీ నటించాడు.  అదే ఖుషీతో పవన్ కు ఆగిపోయిన ఇండస్ట్రీ హిట్ 12ఏళ్ల తర్వాత అత్తారింటికి దారేదితో వచ్చింది. ఖుషీలో ఓ పాత్ర చేసిన తమిళ నటి ముంతాజ్ మళ్లీ అత్తారింటికి దారేదిలో ఓ పాటలో నటించింది. అలాగే.. 2007లో హ్యాపీడేస్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల సరిగ్గా పదేళ్ల తర్వాత ఫిదాతో అంతే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మధ్యలో శేఖర్ సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లినవే.

 

 ఇవన్నీ యాధృచ్చికంగా జరిగినవే అయినా పరిశీలించి చూస్తే ఇవి నిజమనిపిస్తాయిఆయా క్యారెక్టర్లు సినిమాను లిఫ్ట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సినిమా జయాపజయాల్లో కంటెంట్ మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుందనేది నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: