ఎస్ ఎస్ రాజమౌళి ఈ పేరు వింటే రికార్డ్స్ కూడా బయపడతాయి. హీరో ఎవరైనా , కథ ఏదైనా కూడా అందరిలో ఆసక్తి కలిగించేలా చేసి, సినిమా బ్లాక్ బ్లాస్టర్ చేయడం ఈయనికి వెన్నతో పెట్టిన విద్య. స్టార్ హీరోలు కూడా కష్టాలు పడుతున్న సమయంలో ఈగని హీరోగా పెట్టి బంపర్ హిట్ కొట్టాడు మన జక్కన్న. ముఖ్యంగా సినిమా కథ, స్క్రీన్ ప్లే ...ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సినిమాకి రావాల్సిన బజ్ క్రియేట్ చేయడం...ఆ అంచనాలని సినిమా థియేటర్లలోకి వచ్చేవరకు అలానే కొనసాగించడం.. సినిమాని సూపర్ హిట్ గా నిలపడం రాజమౌళి కి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అని చెప్పాలి. సినిమా మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే సినిమా లైన్ చెప్పి మరీ ..సినిమాపై హైప్ పెంచే ఏకైక డైరెక్టర్ రాజమౌళి

ఆ జక్కన్న చెక్కిన శిలలో అయిన ఏదైనా తప్పు ఉంటుందేమో కానీ, ఈ జక్కన్న చెక్కిన చిత్రంలో తప్పులు వెతకడం చాలా కష్టం. అందుకే రాజమౌళి ని అందరూ దర్శక ధీరుడు అని పిలుస్తారు. ఇకపోతే ఈయన రూపొందించిన  బాహుబలి1, బాహుబలి 2 సినిమాలు ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి ప్రపంచ సినిమా ఇండస్ట్రీ పై తనదైన ముద్రవేశాడు. హాలీవుడ్ సైతం నేడు టాలీవుడ్ వైపు చూస్తోంది అంటే అది రాజమౌళి చలవే.
ఇకపోతే ఎన్టీఆర్ తో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ తో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి ..నేటికి కూడా అపజయం ఎరుగని డైరెక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసాడు. తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాల్సిందే.

ఇక విషయానికొస్తే..... టాలీవుడ్ లో రాజమౌళికి ఘనమైన పేరు ఉన్నప్పటికీ రాజమౌళి తో సినిమా చేయాలి అంటే స్టార్ హీరోలకి సైతం వెన్నుల్లో వణుకు పుడుతుంది. అదేంటి రాజమౌళి సినిమా కోసం అందరూ ఎదురుచూస్తుంటారు కదా అని అనుకుంటున్నారా.... రాజమౌళి తో చేసే సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని అందరికి తెలుసు కానీ, తరువాత మాత్రం ఘోరమైన ప్లాప్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి ,రెండుసార్లు కాదు మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన బాహుబలి వరకు నిజమైంది.  

ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ తీస్తే ..ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ ఎటువంటి కష్టాలు పడింది అందరికి తెలిసిందే. మళ్ళీ రాజమౌళి సింహాద్రి సినిమా చేసి ఎన్టీఆర్ కి స్టార్ అనే గుర్తింపు ఇచ్చారు. అయినప్పటికీ ఆ తరువాత వచ్చిన సినిమా ఘోరంగా విఫలం అయింది. అలాగే రామ్ చరణ్ మగధీర తరువాత ఆరెంజ్ తో బిగ్ ప్లాప్ చూసాడు. ఈగ తో నాని, మర్యాద రామన్న తో సునీల్ హిట్ కొడితే..ఆ తరువాత వారు నటించిన సినిమాలు ఎప్పుడొచ్చయో వారికి మాత్రమే తెలుసు. ఇక తాజాగా బహుబలి తో ప్రభాస్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా...ప్రభాస్ బాహుబలి తరువాత నటించిన తాజా చిత్రం  సాహో ఒక బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో రాజమౌళి పేరు చెప్తేనే స్టార్ హీరోలు హడలిపోతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: