బిగ్ బాస్ సీజన్3 లో సరికొత్త మలుపు.ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ ని ముందుండి నడిపిస్తూ వచ్చిన హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పేసాడు అనే వార్తలు వినపడుతున్నాయి. దీనితో బిగ్ బాస్ సీజన్3 స్పెషల్ హోస్ట్ గా బాహుబలి లో శివగామి గా తన నట విశ్వరూపం చూపిన నీలాంబరి ఎంట్రీ ఇచ్చింది.  

తాజాగా విడుదలైన బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో హోస్ట్ గా రమ్యకృష్ణ బిగ్ బాస్ స్టేజ్ పైకి శివగామి గెటప్ లో బాహుబలి మ్యూజిక్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇదే నా మాట నా మాటే శాసనం అంటూ బిగ్ బాస్ కి కూడా వార్నింగ్ ఇచ్చింది ఈ శివగామి.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో ఈ వీకెండ్ చాలా సర్ప్రైజెస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హోస్ట్ స్థానంలో నాగ్ కి బదులు రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్, అభిమానులకి బిగ్ షాక్ ఇవ్వగా... ఈ వీక్ ఎలిమినేషన్ లేకుండా చేసి హౌస్ మేట్స్ కి స్వీట్ షాక్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు. స్పెషల్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ఈ వీక్ ఎవరిని ఎలిమినెట్ చేయకుండా అందరిని సేఫ్ చేయబోతుంది. 

అందుకే ఈవీక్ మొదటగా ఆరుగురు నామినేట్ కాగా.. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి ముగ్గురిని ఎలిమినేషన్ నుండి బయటపడేశాడు. ఇక ముగ్గురు మాత్రమే నామినేషన్స్ లో ఉండటం తో ఈ వీక్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసినట్టు సమాచారం.అలాగే నాగ్ ప్లేస్ లో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ కూడా హౌస్ మేట్స్ తో చాలా చలాకీగా మాట్లాడినట్టు సమాచారం. మరి నాగ్ ట్రిప్ అయ్యాక బిగ్ బాస్ కి హోస్టుగా చేస్తాడా లేదా అనేది తెలియడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: