బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా కింగ్ నాగార్జున అదరగొడుతున్నారన్న విషయం తెలిసిందే. ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా కూడా అలరిస్తున్నాడు. ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో సర్ ప్రైజింగ్ గా 7వ వారం హోస్ట్ గా నాగార్జున మిస్ అవుతున్నాడట.


అదేంటి హోస్ట్ మధ్యలో మిస్ అవడం ఏంటి అనుకోవచ్చు. రీసెంట్ గా నాగార్జునకు ఫీవర్ వల్ల కాస్త నీరసపడ్డారట. అందుకే బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా ఏమి లేకుండా ఫామిలీతో ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. అయితే వారం వారం బిగ్ బాస్ షూట్ తప్పనిసరిగా చేయాలి. శని ఆదివారాల్లో నాగార్జున కనబడాల్సిందే. 


అయితే ఈ వారం మాత్రం నాగార్జునకు బదులుగా శివగామి రమ్యకృష్ణ ప్రత్యక్షమవుతుంది. నామాటే శాసనం అంటూ నాగార్జున బదులుగా ఈ శని ఆదివారాలు బిగ్ బాస్ షో నడిపించనుందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున ఎక్కడ కనిపించలేదు శివగామి రమ్యకృష్ణ మాత్రం తన ఎంట్రీతో సర్ ప్రైజ్ చేసింది.  


స్పెషల్ హోస్ట్ గా రమ్యకృష్ణ ఆడియెన్స్ కు మాత్రమే కాదు కంటెస్టంట్స్ కు షాక్ ఇవ్వనుంది. మిగతా స్టార్స్ ఎవరు ఖాళీగా లేరనుకుంటా అందుకే రమ్యకృష్ణని హోస్ట్ గా తీసుకొచ్చారు. బిగ్ బాస్ హిస్టరీలో ఇలా ఒకే సీజన్ లో ఇద్దరు హోస్టులు కనిపించలేదు. టాలీవుడ్ లో ఏదైనా జరగొచ్చు కాబట్టే ఇలా నాగార్జున బదులుగా రమ్యకృష్ణ వచ్చింది. మరి ఈరోజు షో ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ వారం ఎలిమినేషన్స్ లో పునర్నవి, మహేష్, హిమజలు ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్ అవుతారు ఎవరు హౌజ్ నుండి బయటకు వస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: