సాధార‌ణంగా ఒక సినిమా హిట్ ప‌డితే ఆ ద‌ర్శ‌కుడికి, ఆ హీరోకి గుర్తింపు వ‌స్త‌ది అలాగే మార్కెట్‌లో వాళ్ళ స్థాయి పెరుగుతుంది. త‌ర్వాత వ‌సినిమాకి భారీ అంచ‌నాలు ఏర్ప‌డి రెమ్యూన‌రేష‌న్లు కూడా భారీగానే ఉంటాయి. కానీ అదేమిటో ఒక ద‌ర్శ‌కుడితో హిట్ ఇచ్చిన ఆ హీరోకి భారీ ఫ్లాప్ మాత్రం ఖాయ‌మ‌వుతుంది. ఇది ఆ ద‌ర్శ‌కుడి తాలూకు శాప‌మో ఆ హీరోకి  త‌గులుతున్నాయి. ఆ ద‌ర్శ‌కుడు త‌ర్వాత‌నే నిర్మాత‌లు డిస్ట్రిబ్యూట‌ర్లు న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని సినీ వ‌ర్గాలు అనుకుంటున్నారు. ఈ విషయం సాహో సినిమాతో మ‌రింత బ‌ల‌ప‌డింద‌నే చెప్పాలి.


వివ‌రాల్లోకి వెళితే... ద‌ర్శ‌క‌ధీరుడు అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ని ప్ర‌పంచ చిత్ర ప‌ఠంలో నిలిపిన యోధుడు రాజ‌మౌళి ఇందుకు కార‌ణం రాజ‌మౌళి. రాజ‌మౌళి చేసిన మొద‌టి చిత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 హిట్ అయిన త‌ర్వాత సుబ్బు అట్ట‌ర్ ఫ్లాప్ త‌ర్వాత రాజ‌మౌళి సింహాద్రి సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. మ‌రో పెద్ద ద‌ర్శ‌కుడు హిట్లు మీద హిట్లు కొడుతూ వ‌రుస విజ‌యాల్లో ఉన్న పూరీజ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో  ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం, ఇడియ‌ట్‌,  లఅమ్మానాన్న‌త‌మిళ‌మ్మాయి హ్యాట్రిక్ విజ‌యాల్లో ఉన్నాడు. త‌ర్వాత పూరీ, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఆంధ్రావాలా ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. నితిన్ చేసిన సై సినిమా నితిన్కి మంచి పేరు తెచ్చింది. క్రీడ‌ల నేప‌ధ్యంలో చేసిన ఈ చిత్రం రాజ‌మౌళికి, నితిన్‌కి మంచి హిట్‌ని అందిస్తే ఆ త‌దుప‌రి చిత్రం శ‌త చిత్రాల ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ , అల్ల‌రిబుల్లోడు సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా ఛ‌త్ర‌ప‌తి ప్ర‌భాస్‌కి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చి భారీ హిట్ సాధించిన చిత్రం.  ఆ త‌ర్వాత వ‌ర్షం లాంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎం.ఎస్‌.రాజు పౌర్ణ‌మి సినిమా ఎంతో ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. 


ఎం.ఎస్‌.రాజుకు, ప్ర‌భాస్‌కు పౌర్ణ‌మి చిత్రం కోలుకోలేని ప‌రాజ‌యాన్ని తెచ్చిపెట్టింది. పౌర్ణ‌మి దాదాపుగా ఎం.ఎస్‌.రాజు సంస్థ‌ను తీవ్ర‌మైన న‌ష్టాల్లో పెట్టేసింది. రాజ‌మౌళి, ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన విక్ర‌మార్కుడు చిత్రం అప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజకు సూప‌ర్‌హిట్ల‌ రాజ‌మౌళికి ఘ‌న విజ‌యాన్ని అందించింది. విక్ర‌మార్కుడు త‌ర్వాత ర‌వితేజ‌, ఇలియాన కాంబినేష‌న్‌లో వ‌చ్చిన క‌త‌ర్‌నాక్ చేశారు. క‌త‌ర్‌నార్ సినిమాతో ర‌వితేజ‌కు ఫ్లాప్‌ల ప‌రంప‌ర మొద‌ల‌యింది. భారీ వ్య‌యంతో నిర్మించిన రాంచ‌ర‌ణ్ హీరోగా మ‌గ‌ధీర సినిమా రికార్డులు సాధించింది. ఇంత పెద్ద విజ‌యాన్ని చ‌విచూసిన రాంచ‌ర‌ణ్‌త‌ర్వాత నాగ‌బాబు నిర్మాత‌గా పూర్తి స్థాయిలో విదేశాల్లో నిర్మించిన చిత్రం ఆరెంజ్‌. ఆ సినిమా అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందలు చేసింది ఆరంజ్ సినిమాతో నాగ‌బాబుకు పెద్ద ఆర్ధిక ఇబ్బందులు వ‌చ్చాయ‌ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. రాజ‌మౌళి మ‌రో ప్ర‌యోగం క‌మెడియ‌న్ సునీల్‌ని హీరోగా పెట్టి మ‌ర్యాద‌రామ‌న్న చిత్రం తీసి మంచి విజ‌యం సాధించింది. ఆ చిత్రం సునీల్‌కి హీరోగా నిల‌బ‌డ‌డానికి ఆశ‌లు క‌ల్పించింది. ఈ సినిమా త‌ర్వాత సునీల్ హీరోగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌తో క‌థ స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌కుడు అప్ప‌ల‌రాజు  తీశారు. 


రామ్‌గోపాల్ వ‌ర్మ కెరియ‌ర్‌కి సునీల్ ప‌త‌నానికి ఆ చిత్రం పెద్ద పేరు తెచ్చింది. ఆ త‌ర్వాత హీరోలే కారు ఈగ‌ల‌తో కూడా సినిమా చేస్తాన‌ని ఓ ప్ర‌యోగ‌త్మ‌క చిత్రం తీశారు.  నాని హీరోగా న‌టించారు. ఈ చిత్రం త‌ర్వాత నాని ఎటో వెళ్లిపోయింది మూవీ చేశాడు. మ‌రో రెండేళ్ళ వ‌ర‌కు ఫ్లాప్‌ల దారిప‌ట్టాడు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి బాహుబ‌లి పార్ట్ 1,2 తీశాడు. ఈ చిత్రంతో ప్ర‌పంచ తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. ఆ చిత్రం అంద‌రికి గ‌ర్వ‌కార‌ణం అయింది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ హీరోగా దేశంలో అంద‌రికీ సుప‌రిచితుడ‌య్యాడు ఈ సినిమాలోని పాత్ర‌ల గురించి ప్ర‌ధాన‌మంత్రి కూడా పార్ల‌మెంట‌లో ప్ర‌స్ధావించ‌డం విశేషమ‌ని చెప్పుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ స్ధాయి ఊహించ‌ని రీతిలో అమాంతం పెరిగిపోయింది. బాహుబ‌లి విజ‌యాన్ని ఆ త‌ర్వాత సినిమా బిజినెస్‌ని సొంతం చేసుకునే ఉద్దేశంత ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్‌లో మూడు వంద‌ల కోట్ల వ్య‌యంతో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో  ప‌ది వేల స్క్రీన్ల‌లో  భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయింది. ఇటీవ‌లె విడుద‌లైన సాహో సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఈ టాక్ వ‌ల్ల సాహో సినిమా నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, బ‌య్య‌ర్లు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని ఫిల్మ్ వ‌ర్గాల టాక్‌. దీన్ని బ‌ట్టి చూస్తే సినిమా మేధావులు రాజ‌మౌళి త‌ర్వ‌త చేసే చిత్రం ఏ నిర్మాత చేసినా వారికి శ్రేయ‌స్క‌రం కాద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. పైనున్న సినిమాల‌ను ప‌రిశీలిస్తే అవ‌న్నీ నిజ‌మేన‌ని చెపుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: