బాహుబలి 1 సినిమా పూర్తయ్యాక ఓ ట్యాగ్ బాహుబలి 2 సినిమా రిలీజ్ అయ్యే వరకు ట్రెండ్ అయ్యింది. అదేమంటే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. ఇదే బాహుబలి 2 సినిమాను వార్తల్లో నిలిపింది.  రాజమౌళి ఫస్ట్ పార్ట్ ను ఎండ్ చేసి.. న్యూస్ లో ఉంచుతూ.. వైరల్ అయ్యేలా చూడటానికి వేసిన ప్లాన్ అది.  ఆ ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది.  సెకండ్ పార్ట్ స్టోరీ ఏంటో అందరికి తెలుసు.  కానీ, ఆ స్టోరీని తీసిన విధానం ప్రతి ఒక్కరికి నచ్చింది.  అందులో వేల కొట్ట రూపాయలు వసూలు చేసింది. 


సినిమా బంపర్ హిట్ కావడంతో ప్రభాస్ రేంజ్ జాతీయ స్థాయికి పెరిగింది.  అయితే, ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ సినిమా చేయబోతున్నాడో అని అందరు ఎదురు చూశారు.  దాదాపు రెండేళ్లపాటు కష్టపడి సాహో సినిమాను తెరక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా డబ్బు పెట్టి సినిమా తీసింది.  ఈ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో అనుకున్నా.. చివరకు సినిమా భారీ పరాజయం పాలైంది.  


ఎప్పుడైతే సినిమాకు నెగెటివ్ టాక్ రన్ కావడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే అప్పటి నుంచి సినిమాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.  కట్టప్ప ముందుగానే ఊహించి బాహుబలిని చంపేశాడని.. కానీ కొన్ని కారణాల వలన బాహుబలి సాహో రూపంలో వచ్చాడని.. ఆలా రాకుండా ఉంటె బాగుండేదని ట్రోల్ చేస్తున్నారు.  నెటిజన్లు రకరకాల మీమ్స్ తో ఆడుకుంటున్నారు.  సినిమా ఏ స్థాయిలో ఉన్నది అంటే సినిమాలో కథ, కథనాలు ఎక్కడ ఉన్నాయో అని టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నట్టుగా కొందరు, సినిమా ట్రైలర్ సమయంలో జురాసిక్ వరల్డ్ సినిమాలోని డైనోసార్ లాగా ఉంటె, సినిమా రిలీజ్ తరువాత ఇంటర్నెట్ ఆఫ్ అయ్యాక గూగుల్ గేమ్ లో చూపించే డైనోసార్ లా మారిపోయిందని అంటూ ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ చూసి పాపం ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఫీలవుతున్నారో ఏమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: