బిగ్ బాస్ హౌజ్ లో లేడీ హోస్ట్ గా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హంగామా చేసింది. ఈ వారం నాగార్జున బర్త్ డే వేడుకల్లో భాగంగా స్పెయిన్ వెళ్లాడు. అందుకే బిగ్ బాస్ కు దూరమయ్యాడు. శని, ఆదివారాల్లో రావాల్సిన షోకి నాగ్ మిస్ అవడంతో సర్ ప్రెజింగ్ గా రాజమాత శివగామి ప్రత్యక్షమైంది. 


తనదైన శైళిలో ఎలాంటి పాత్రలో అయినా మెప్పించే రమ్యకృష్ణ బిగ్ బాస్ స్పెషల్ హోస్ట్ గా అదరగొట్టారు. హౌజ్ లో కంటెస్టంట్స్ అందరితో సరదాగా ఉంటూనే తన మార్క్ పంచులు వేసింది. ఏదో వచ్చాం ఈరోజు షో చేసి వెళ్తామన్నట్టు కాకుండా మొదటి నుండి షో ఫాలో అవుతున్న విధంగా రమ్యకృష్ణ ప్రతి కంటెస్టంట్ చేసిన పనుల గురించి ఇచ్చిన డీటైలింగ్.. అడిగిన ప్రశ్నలు శభాష్ అనిపించాయి.


ఎంత స్క్రిప్ట్ అయినా సరే దాన్ని ప్రాపర్ గా చేయడం కూడా ఒక టాస్క్ అన్నట్టే. ఆ విషయంలో రమ్యకృష్ణ ఎలాంటి తడబాటు లేకుండా చేశారు. అంతేకాదు నేను నాగార్జున అంత సాఫ్ట్ కాదని కంటెస్టంట్స్ కు చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతేకాదు హౌజ్ లో ఎవరికి అన్యాయం జరిగిందో తెలుసుకుని మాట్లాడింది.


ముఖ్యంగా హౌజ్ లో ఆడవాళ్లకు సపోర్ట్ గా ఉంటూ షోని సక్సెస్ చేసింది. ఎంచుకున్న పాత్ర ఎలాంటిదైనా తన నటనతో మెప్పించే రమ్యకృష్ణ.. బిగ్ బాస్ హోస్ట్ గా కూడా అదరగొట్టింది. బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ చేయడం బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ శనివారం బిగ్ బాస్ హౌజ్ లో అంతా సరదాగా గడిచింది. నామినేషన్స్ లో ఉన్న మహేష్, హిమజ, పునర్నవిలలో శనివారం ఎవరిని సేఫ్ జోన్ లోకి పంపలేదు. ఆదివారమే డైరెక్ట్ గా ఒకరిని ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: