ప్రపంచ ప్రసిద్దిగాంచిన పోర్న్ స్టార్స్ లో సన్నీ లియోన్, మియా మాల్కోవా.. తర్వాత మళ్ళీ అంత పాపులర్‌గా వినిపించే పేరు మియా ఖలీఫా. ఈమె పోర్న్ సినిమాల్లో నటించింది కేవలం మూడు నెలలు మాత్రమేనట. దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎంతో బాధకరమైన సందర్బంలో మియా ఖలీఫా పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లిందట. పోర్న్ సినిమాలు మానేసి ఒక లైబ్రేరియన్ గా కెరీర్ ను మొదలు పెట్టినా కూడా ఆమెకు సంబంధించిన పోర్న్ సినిమా జ్ఞాపకాలు వదిలి పెట్టడం లేదంటు వాపోతోంది. తాజాగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మియా ఖలీఫా తనకు సంబంధించిన సంచలనమైన విషయాలను వెళ్లడించింది.

మియా..నేను బలవంతంగా వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది. నేను ఎన్నో కలలు కన్నాను. కాని అవి సాకారం కాకుండానే అప్పట్లో నేను చేసిన పనుల కారణంగా జీవితం నాశనం అయ్యింది. సినిమా అవకాశాలంటూ నన్ను ఎంతో మంది వాడుకున్నారని...పోర్న్ ఇండస్ట్రీలో కేవలం మూడు నెలలే ఉన్న తాను దాని నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయని...బయటి ప్రపంచంలో తిరగాలంటే భయమేస్తుందంటు...నా గురించి గూగుల్ లో జనాలు సెర్చ్ చేసే విధానం చూస్తుంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

బయటకు వెళ్లిన సమయంలో కూడా కొందరు.. నన్ను చూస్తున్న చూపును చూస్తుంటే.. వారు నా డ్రస్ ను చించి నా శరీరాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుందంటు...ఆ చూపులు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయంటు తన ఆవేదనను వ్యక్తం చేసింది. నా గతం కారణంగా ఎవరితో సరిగా కలవలేక పోతున్నాను. కనీసం నా ఫ్యామిలీతో కూడా సరిగా ఉండటం లేదు. నా ఫ్యామిలీ దాదాపుగా బహిష్కరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. నా వ్యక్తిగత జీవితం మొత్తం నాశనం అయ్యిందని మియా ఖలీఫా ఎమోషనల్ అయ్యింది. మరి బ్రతకడానికి ఎన్నో మార్గాలు, కూటి కోసం కోటి విధ్యలు ఉండగా ఈ దారే ఎందుకు ఎంచుకున్నాట్టు.. ఎప్పుడెందుకు బాధపడుతున్నట్టు..అని ఈ విషయం తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: