ఆడియెన్స్ ఊహించినట్టు జరిగితే అది బిగ్ బాస్ షో ఎలా అవుతుంది అనుకుంటారో ఏమో రూల్స్ పెట్టడము బ్రేక్ చేయడమూ రెండు బిగ్ బాస్ కే చెల్లుబాటు అవుతుంది. అసలు ఇప్పటివరకు ఏ భాషలో జరగని పరిణామాలన్ని తెలుగు బిగ్ బాస్ లో జరుగుతున్నాయి. మూడు సీజన్లకు ముగ్గురు హోస్ట్ లు మారారు. 


అదిచాలదు అన్నట్టు ఈవారం ఎపిసోడ్ కు నాగార్జున డుమ్మా కొట్టి ఆయన ప్లేస్ లో రమ్యకృష్ణని హోస్ట్ గా పెట్టారు. ఆమె ఎంత సీనియర్ నటీమణి అయినా బిగ్ బాస్ షోని హ్యాండిల్ చేసే సత్తా ఉండాలి కదా.. అయితే రాజమాత శివగామి మాత్రం అనుకున్న దాని కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మెప్పించింది.


హోస్ట్ గా రమ్యకృష్ణ అదరగొట్టేసింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో మహేష్, పునర్నవి, హిమజలు ఉన్నారు. ముందు ఆరుగురు నామినేట్ అవగా ముగ్గురు సాక్రిఫైజ్ చేసి మిగతా ముగ్గురు నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ కోరగా వరుణ్, రవి, రాహుల్ లను సేవ్ చేసి పునర్నవి, హిమజ, మహేష్ నామినేట్ అయ్యారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. 


కాని ఇక్కడ విషయం ఏంటంటే ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఎలిమినేషన్ ఉండదట. ముగుగురిని సేవ్ చేసి ఈ వారం ఎలిమినేషన్ లేకుండా బిగ్ బాస్ ప్లాన్ చేశాడట. అయితే అంతా బాగున్నా వారం ఎలిమినేషన్ లేకున్నా సరే కంటెస్టంట్స్ కు సపోర్ట్ గా ఆడియెన్స్ నుండి ఓటింగ్ సిస్టెం ద్వారా మెసేజులు, కాల్స్ చేయమని చెప్పారు. ఎలిమినేషన్ లేకపోతే మా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని కొందరు అంటున్నారు. తమిళ బిగ్ బాస్ లో నామినేషన్ లేని వారం ప్రేక్షకులకు ముందే ఎలాంటి ఓటింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారట. మరి తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియాల్సి ఉంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: