యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ లో మొత్తంగా చూసుకుంటే ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్ సూపర్ హిట్స్ కాగా సినిమా చూపిస్త మావ యావరేజ్ గా నిలిచింది. ఇక ఆ సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కు చెప్పుకోదగ్గ సినిమా లేదని చెప్పాలి. వరుస ఫ్లాప్స్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ మధ్య యాక్సిడెంట్ హడావుడితో వార్తల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉంటే ఈ హీరో చేతిలో వున్న రెండో సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. రెండో సినిమాను గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాలను తెరకెక్కించిన కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో చేయబోతున్నారు. సత్యసాయి ఆర్ట్స్ కెకె రాధామోహన్ నిర్మాత.

మాళవిక శర్మ కథానాయికగా నటించే ఈ సినిమాకు 'ఓరే బుజ్జీ ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. వాస్తవానికి బుజ్జిగాడు అనే టైటిల్ అనుకున్నారట. కానీ గతంలో ప్రభాస్ హీరోగా ఈ పేరుతో సినిమా రావడంతో, ఆప్షనల్ టైటిల్ గా 'ఒరే బుజ్జీ' అనే టైటిల్ ఫిక్స్ చేసారట చిత్ర బృందం. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ గత చిత్రాల మాదిరిగా ఈ చిత్రం కూడా ఒక క్యూట్ లవ్ స్టోరీ కావడంతో ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 10 నుంచి సెట్ మీదకు వెళ్తుంది. వాస్తవానికి ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా రాజ్ తరుణ్ అనుకోని హడావుడి వల్ల లేట్ అయినట్లు తెలుస్తోంది. లేకపోతే ఈ సినిమా దాదాపు సగం వరకు టాకీ పార్ట్ కంప్లీటవ్వాల్సింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాకు గ్యాప్ రావడంతో, ఈ సినిమా ఆలస్యం అయింది. మరి ఈసారైనా రాజ్ తరుణ్.. బ్రేకులు పడ్డ తన కెరీర్ ను స్పీడ్ పెంచుతాడా లేదా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: