ప్రభాస్ ను ఇప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ అంటూ అభిమానులు చాల ముద్దుగా పిలుచుకుంటారు. ఈనేపధ్యంలో ‘సాహో’ కు డివైడ్ టాక్ వచ్చినా నిన్న ఈమూవీకి తెలుగురాష్ట్రాలలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడ కొనసాగిన కలక్షన్స్ సునామీని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ కు ‘న్యూ మెగా స్టార్’ అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రభాస్ కలక్షన్స్ స్టామినా పై ఆసక్తికర కథనాలను ప్రచురిస్తున్నాయి. 

ప్రభాస్ ‘బాహుబలి’ తో ఇండియా టాప్ సెలెబ్రెటీగా ఎదిగి పోయాడు. కేవలం అతడి క్రేజ్ ను నమ్ముకుని నిర్మించిన ‘సాహో’ కు నాన్ హాలిడే సీజన్ లో కూడ అత్యంత భారీ ఓపెనింగ్ రావడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. బాలీవుడ్ టాప్ స్టార్లు వల్ల కూడ కానిపనిని ఒక తెలుగు హీరో చేసి చూపించడంతో ఇప్పటి వరకు ప్రభాస్ పై వ్యతిరేక ప్రచారం చేసిన మీడియా వర్గాలు ప్రభాస్ పై ఇప్పుడు ఒకేసారి ప్రేమను ఒలకపోస్తున్నాయి. 

ఒక చిన్న డైరెక్టర్ తీసిన ‘సాహో’ తో డివైడ్ టాక్ వచ్చినా కూడ కలక్షన్స్ సునామీ సృష్టిస్తోంది అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. అంతేకాదు ‘సాహో’ కు ప్రస్తుతం వస్తున్న రికార్డ్ కలక్షన్స్ పై వార్తలు వ్రాస్తూ వాస్తవానికి ఈమూవీ ఒక హాలిడే టైమ్ ను దృష్టిలో పెట్టుకుని విడుదలై ఉంటే  ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చినా మరింత భారీ కలక్షన్స్ వచ్చి ఉండేవి అన్న తమ  అభిప్రాయాన్ని బాలీవుడ్ మీడియాలోని కొన్ని వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి. 

మన తెలుగు రాష్ట్రాలకి వస్తే ‘సాహో’ కు డివైడ్ టాక్ వచ్చినా మిగతా టాప్ హీరోలు ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్ ఉన్నాడు అన్న వాస్తవాన్ని ‘సాహో’ ఓపెనింగ్‌ కలక్షన్స్ నిరూపించడమే కాకుండా ఈకలక్షన్స్ మ్యానియా నిన్న రెండవరోజు కూడ కొనసాగడంతో ఈమూవీకి ఈసారి తెలుగు రాష్ట్రాలకు కలిసి వచ్చిన వినాయకచవితి హాలిడేను కూడ పరిగణలోకి తీసుకుంటే ఈవీకెండ్ కు ఈమూవీ 250 కోట్ల గ్రాస్ కలక్షన్స్ అందుకున్న సినిమాగా మారడం ఖాయం అని అంటున్నారు. దీనితో ‘సాహో’ ఫలితం ఎలా ఉన్నా రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ సపోర్ట్ లేకపోయినా కేవలం ప్రభాస్ కోసమే సినిమా ధియేటర్లకు వస్తున్న జనాన్ని చూసి ఫిలిం ఇండస్ట్రీలో ‘న్యూ మెగా స్టార్’ అవతరించాడు అంటూ మీడియాలోని కొన్ని వర్గాలు ఒక కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: