జబర్దస్త్ షో ద్వారా ఎందరో సెలెబ్రిటీలుగా మారారు. ఈ షో యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్‌కు మాస్‌లో మాంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక జబర్దస్త్ షో కమెడియన్ల విషయానికి వస్తే ముందుగా హైపర్ ఆది గురించి ప్రస్తావించాలి. అయన పంచులు, డైలాగ్ డెలివరీ, స్పాంటేనియస్ సెటైర్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. నిజానికి జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది..అదే ఊపుతో ఇటీవల సినిమాల్లో హల్చల్ చేస్తున్నాడు. అరకొర సినిమాల్లో కనిపించినప్పటికే ఆ సినిమాలో ఆదికి మంచి పాత్రలే వరిస్తున్నాయి. ఇకపోతే ఆది ఇప్పుడు జబర్దస్త్ షో కి దూరం అవుతున్నాడని విశ్వసనీయ సమాచారం. అసలు వివరాలలోకి వెళితే... 


జబర్దస్త్ షో ద్వారా హైపర్ ఆది వెలుగులోకి వచ్చాడు. విభిన్నమైన పంచులు, ప్రాసలతో అందర్నీ నవ్విస్తున్నాడు. కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్నపటికీ కవర్ చేస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే ఆది జబర్దస్త్ షోకి దూరం అవుతున్నాడనే వార్త ప్రముకంగా వినిపిస్తుంది. అసలు కారణం ఏంటంటే..బిగ్ బాస్ హౌస్ నుండి గతవారం అషూ రెడ్డి బయటకు వచ్చేశారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో సెలబ్రిటీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి షోలో ఇంట్రెంస్ట్ క్రియేట్ చేసే వ్యక్తిని ఎంటర్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. సో ఇప్పుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి వైల్డ్ కార్ట్ ద్వారా హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. 


బిగ్ బాస్ షో అంటేనే కొట్లాటలు,నమ్మకద్రోహాలు,సాడీలు.మరి ఏలాంటి వాతావరణంలో జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ అది బిగ్ బాస్ హౌస్ లో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: