‘సాహో’ మూవీ కలక్షన్స్ రికార్డులు సృష్టించే విషయంలో వెనకపడినా మహేష్ స్థానానికి మాత్రం ఎర్త్ పెట్టడంతో ఇప్పుడు మహేష్ తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాల కష్టపడవలసి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘సాహో’ టాక్ ఎలా ఉన్నా ఈమూవీ తెలుగు రాష్ట్రాలలో 36 కోట్లు నెట్ కలక్షన్స్ సాధించడంతో టాలీవుడ్ టాప్ 5 మూవీస్ లో ‘సాహో’ స్థానం సంపాదించింది. 

ఇప్పటి వరకు ఈ టాప్ 5 లిస్టులో ‘బాహుబలి 2’ తరువాత ‘అరవింద సమేత’ ‘అజ్ఞాతవాసి’ ‘వినయ విధేయ రామ’ ‘మహర్షి’ మూవీలు టాప్ 5 ఫస్ట్ డే నెట్ కలక్షన్స్ లిస్టులో ఇప్పటి వరకు కొనసాగాయి. ఇప్పుడు ‘సాహో’ మొదటి రోజు 36 కోట్లు నెట్ కలక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుండి మొదటిరోజు వసూలు చేయడంతో ‘సాహో’ రెండవ స్థానంలోకి వెళ్ళిపోయి ఇప్పటి వరకు ఈ లిస్టులో చివరి స్థానంలో కొనసాగుతున్న ‘మహర్షి’ స్థానం టాప్ 5 లో గల్లంతైంది. 

దీనితో మహేష్ లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీక్వరు’ తో తిరిగి ఈ టాప్ 5 స్థానంలో చోటు సంపాధించుకోవాలి అంటే ఈ మూవీకి కనీసం 27 కోట్ల పై చిలుకు నెట్ కలక్షన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ కు తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు వచ్చి తీరాలి. అయితే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈమూవీ సోలో రిలీజ్ కాకుండా బన్నీ ‘అల వైకుంఠపురం’ తో పోటీగా వస్తున్న నేపధ్యంలో ఈ ఫిగర్స్ మహేష్ మూవీకి అంత సులువు కాదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఈలోపు దసరాకు ‘సైరా’ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ టాప్ 5 లెక్కలలో చాల మార్పులు వచ్చే ఆస్కారం ఉంది. దీనితో మహేష్ సినిమాకు తిరిగి మొదటిరోజు కలక్షన్స్ విషయంలో టాప్ 5లో స్థానం దక్కాలి అంటే ‘సరిలేరు నీకెవ్వరు’ అద్భుతాలు సృష్టించాలి. ఇటువంటి పరిస్థితులలో అంత స్టామినా ‘సరిలేరు నీకెవ్వరు’ ఉందా అన్నదే సందేహం..  


మరింత సమాచారం తెలుసుకోండి: