హీరోలు, హీరోయిన్‌లు, నిర్మాతలు, పొలిటికల్‌ లీడర్స్‌ అంతా కలిపి పదిమందికి పైగా ఉన్నారు. అంత పెద్ద ఇల్లు కాబట్టి వాళ్లతో ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌ సహజీవనం చేస్తుంటుంది. పవన్‌ కల్యాణ్‌ ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశాడని ఆ మధ్య ఒక రూమర్‌ వచ్చింది. ఇప్పుడు అల్లు అరవింద్‌కి, ఆయన కొడుకు అల్లు అర్జున్‌కి సినిమాలు తీసే విషయంలో మాటామాట వచ్చింది మరో రూమర్‌! రాజకీయంగా కూడా చిరంజీవి మీద, పవన్‌ కల్యాణ్‌ మీద అనేక రూమర్‌లు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు అవుట్‌ డేటెడ్‌. అప్‌డేట్‌ ఏంటంటే.. పవన్‌ కల్యాణ్‌కు హీరో రాజశేఖర్‌ కౌంటర్‌ ఇచ్చాడని! ఇవ్వడం అంటే డైరెక్ట్‌గా కాదు.

 

ఇన్‌డైరెక్ట్‌గా. ‘కల్కి’లో రాజశేఖర్‌ హీరో. గత గురువారం విడుదలైన ‘కల్కి’ టీజర్‌లో రాజశేఖర్‌ ‘ఏం సెప్తిరి, ఏం సెప్తిరి.. ఎప్పుడూ ఇలాగే సెప్తారా?’ అంటూ ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌ని ఇమిటేట్‌ చేస్తాడు. గబ్బర్‌సింగ్‌లోని రౌడీల అంత్యాక్షరి సీన్‌లో.. రౌడీలను కమెడియన్‌లా పాడిస్తూ పవన్‌ ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఒక కమెడియన్‌ లేచి, హీరో రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘రోజ్‌ రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా’ అనే సాంగ్‌ని ఎత్తుకుంటాడు. రాజశేఖర్‌ని ఇమిటేట్‌ చేస్తూ సేమ్‌ అలాగే ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తాడు. ప్రేక్షకులు నవ్వలేక చచ్చిన సీన్‌ అది. ఆ రౌడీ కమెడియన్‌.. సాంగ్‌ని పూర్తి చెయ్యగానే ‘ఏం సేస్తిరి.. ఏం సేస్తిరి. ఎప్పుడూ ఇలాగే సేస్తురా.. ఈ మధ్యనే ఇలాగే సేస్తున్నారా?’ అంటాడు.

 

అప్పట్లో రాజశేఖర్‌కి, చిరంజీవికి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తోంది. అది దృష్టిలో పెట్టుకుని పవన్‌ కావాలనే ఆ డైలాగులతో రాజశేఖర్‌కి కౌంటర్‌ ఇచ్చారని ఒక రూమర్‌ వచ్చింది. ఆ సీన్‌ని దృష్టిలో పెట్టుకుని ‘కల్కి’లో ఇప్పుడు రాజశేఖర్‌ పవన్‌కి కౌంటర్‌ ఇచ్చాడని రూమర్‌. ఈ రూమర్‌కి బొత్తిగా బేస్‌ లేకుండా ఏమీ లేదు.


కల్కి టీజర్‌ ఎండింగ్‌లో.. సేమ్‌ అదే కమెడియన్‌ని... పోలీస్‌ గెటప్‌లో ఉన్న రాజశేఖర్‌ (గబ్బర్‌సింగ్‌లోని రౌడీ అంత్యాక్షరిలో పవన్‌దీ పోలీస్‌ గెటప్పే) కాలితో తంతాడు.. ‘ఏంట్రా ఆ ఊపుడు’ అంటూ.. నన్నే ఇమిటేట్‌ చేస్తావా అన్నట్లు. దీంతో రూమర్‌ క్రియేట్‌ అయి చక్కర్లు కొడుతోంది.. గబ్బర్‌సింగ్‌తో రాజశేఖర్‌ని పవన్‌ దెబ్బకొడితే, కల్కితో పవన్‌ని రాజశేఖర్‌ దెబ్బకు దెబ్బ కొట్టాడని.


మరింత సమాచారం తెలుసుకోండి: