ప్రభాస్ ను నేషనల్ స్టార్ ఇమేజ్ కి దగ్గరకు చేసింది ‘బాహుబలి’ ప్రాజెక్ట్ అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. అయితే అటువంటి టాప్ ఇమేజ్ కి ప్రభాస్ కు ‘సాహో’ వల్ల కలిగిన నష్టానికి ప్రభాస్ కంటే రాజమౌళి చాల బాథ పడుతున్నట్లు టాక్. 

వాస్తవానికి ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ ను ఎటువంటి హడావిడి లేని ఒక క్యూట్ లవ్ స్టోరీ మూవీని చేయమని రాజమౌళి ప్రభాస్ కు సూచనలు ఇచ్చినట్లు వార్తలు గతంలోనే వచ్చాయి. అయితే ‘బాహుబలి’ ఇచ్చిన ఇమేజ్ తో అదే స్థాయి సినిమాను నిర్మించాలి అన్న ప్రభాస్ అత్యుత్సాహానికి రాజమౌళి అడ్డుకట్ట వేయలేకపోయినట్లు టాక్. 

దీనితో ఈ మూవీ కథ విషయం తనకు ముందుగానే తెలిసినా ప్రభాస్ స్పీడ్ కు బ్రేక్స్ వేస్తే అతడు నిరుత్సాహపడతాడు అన్న ఉద్దేశ్యంతో ‘సాహో’ కు సంబంధించి పెరిగిపోతున్న ఖర్చుకు మౌనంగా రాజమౌళి ఉండిపోయాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. చివరకు ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ దగ్గర రాజమౌళి ఎంటర్ అయినా కథ లేకుండా జరగవలసిన జరిగిపోవడంతో రాజమౌళి పై పైగా సూచనలు ఇచ్చి ‘సాహో’ భారం నుండి తప్పుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే రాజమౌళికి ప్రభాస్ తో ఉండే సాన్నిహిత్యంతో ‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాజమౌళి అతిధిగా వచ్చి ఈ మూవీ బయ్యర్లకు ప్రభాస్ అభిమానులకు జోష్ కలిగేలా ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఈమూవీని ప్రభాస్ ఎంత బలవంత పెట్టినా ధియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని రాజమౌళి ఈ సినిమాను చూడటానికి ఇష్టపడలేదు అన్న గాసిప్పులు వస్తున్నాయి. దీనితో ‘సాహో’ ఫలితం ముందుగానే రాజమౌళి ఊహించాడ అన్న సందేహాలు కలగడమే కాకుండా జక్కన్నకు ప్రభాస్ పై ‘సాహో’ విషయమై ఏర్పడిన కోపం ఎప్పటికి పోతుంది అంటూ ఈ ప్రాణమిత్రులు సాన్నిహిత్యాన్ని ‘సాహో’ దూరం చేస్తుందా అంటూ కొందరు సందేహాలను వ్యక్త పరుస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: