భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన 'సాహో' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 10 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో నే 1500 స్క్రీన్ కి పైగా ఈ సినిమా విడుదల కాగా సినిమా పాట తొలి షో నుండే డివైడ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు. ఇదే క్రమంలో క్రిటిక్స్ కూడా నెగిటివ్ రివ్యూలు రాయడంతో సినిమాకి మొట్ట మొదటి రోజు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా సాహో సినిమా మొట్ట మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు అదరగొట్టేసింది.


వచ్చిన కలెక్షన్ల పరంగా చూసుకుంటే బాహుబలి2 తర్వాత మరే ఇండియన్ సినిమాకు సాధ్యం కానివిధంగా తొలి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. శనివారం కూడా 'సాహో' వసూళ్లు స్ట్రాంగ్ గానే ఉన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ యూఎస్ లో మాత్రం 'సాహో' వసూళ్లు కాస్త ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. సాహో చిత్రం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా దాదాపు 9 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇది నిరాశాజనకమైన ఆరంభం. శుక్రవారం రోజు 5 లక్షల డాలర్ల వరకు రాబట్టింది. ఇక శనివారం 4 లక్షల డాలర్లతో సరిపెట్టుకుంది.


మొత్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు యుఎస్ లో 1.8 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీకెండ్ పూర్తవగానే దాదాపు 2 మిలియన్ మార్క్ ని సాహో దాటేయడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు కి చెందినవారు. సినిమా విడుదల కాకముందే యూఎస్ లో దాదాపు 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగటం విశేషం. అయితే సినిమా కొన్న బయ్యర్లు నష్టపోకుండా ఉండాలంటే కచ్చితంగా 5 మిలియన్ మార్క్ దాటాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: