ఆడవారి శరీర సౌష్టవం ఎలా ఉండాలో అందరూ నిర్ణయం చేస్తూ ఉంటారు. ఇది ఇంటి నుండి మొదలయ్యి సమాజంలో కూడా అందరూ వేలెత్తి చూపించే స్థాయికి వెళుతూ ఉంటుంది. టీవీలో వచ్చే ఆడ్ కమర్షియల్స్ లో కూడా ఇటువంటి ధోరణి కనిపిస్తూ ఉంటుంది మనకి ఈనాడు. ఇటువంటి దుస్తులు ధరించి కలిగి కూడా అందంగా కనిపిస్తేనే ఒక అమ్మాయి బాగున్నట్టు లేదా ఇటువంటి శరీర సౌష్టవం ఉంటేనే ఒక అమ్మాయి సరిగ్గా ఉన్నట్టుగా నిర్ధారిస్తున్నారు. ఏ ఒక్క చిన్న లోపం లేని వారే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు గా ముద్ర వేస్తున్నారు. పర్ఫెక్షన్ కి యాడ్లు ఉదాహరణలు ఇస్తున్నాయి.


శరీరంపై వెంట్రుకలు ఏ మాత్రం ఉండకూడదు అని ఆపై మొహం పైన మొటిమలు కూడా రాకూడదు అని, చర్మం ఛాయ బాగా నిగారింపుగా ఉండాలి అని, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తరువాత కూడా ఒక అమ్మాయి ఆమె శరీరాకృతి మెయింటైన్ చేయగలగాలి అని, ఇలా చెప్పుకుంటూ పోతే వాడే స్కిన్ పౌడర్ దగ్గర నుంచి టూత్పేస్ట్ వరకు అమ్మాయిలు ఎలా ఉండాలో ఈ రోజు మనకు చెబుతున్నాయి.


తాజాగా జరీన్ ఖాన్ విషయంలో కూడా ఇటువంటి తప్పిదమే సోషల్ మీడియా నెట్ ఆఫ్ చేశారు. సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ పిక్చర్ పెట్టిన జరీన్ ఖాన్ పొట్ట పై ఉన్న స్ట్రెచ్ మార్క్స్ గురించి కామెంట్ చేశారు. వాటికి ఆమె ఫ్యాన్స్ ధీటుగా సమాధానాలు ఇస్తూ జరీన్ ఖాన్ కు సపోర్ట్ గా నిలిచారు.


ఇంస్టాగ్రామ్ లో ఇటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా విరివిగా జరుగుతున్నాయి. వీరు వారు సెలబ్రిటీలు మామూలు వ్యక్తులు అనే తేడా లేకుండా పబ్లిక్ లో పెట్టిన ఫోటోలు పైన ఎవరైనా కామెంట్స్ చేయవచ్చు దీనికి అందరూ సిద్ధంగా ఉంటేనే పబ్లిక్ లో ఫోటోలు పెట్టాలి అనే వాదనలు కూడా వస్తూ ఉంటాయి. అనుష్క శర్మ జరీన్ ఖాన్ ను సపోర్ట్ చేస్తూ నువ్వు ఎలా ఉన్నావో అలాగే అందంగా ఉన్నావు అని ఎవరి కోసం నువ్వు మారవలసిన అవసరం లేదు అని తనకు అండగా నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: