మెగా మేనల్లుడు అల్లు అర్జున్ అలియాస్ బన్నీ.. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్య సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ హీరో గా పేరును సంపాదించాడు. ఆర్య సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్  చేయడంతో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతూ వస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, బద్రీనాథ్ చిత్రాలు కూడా అయన సినీ చరిత్రలో మరచి పోలేని సినిమాలు. కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మారాయి. అయిన ఎక్కడ వెనకడుగు వెయ్యలేదు. 

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టైల్ కి కేరాఫ్ అని  బన్నీని అంటారు. ఎందుకంటే ఈయన స్టైల్ తో , స్టెప్పులతో యావత్ సినీ జనాలను తన వైపు లాకుంటూ వస్తున్నాడు. బన్నీ నాన్ సింక్ పంచెస్ కి యావత్ ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాడు. చాలా మంది హీరోయిన్లు ఈయన సినిమాల ద్వారా సినీ ఇండీడీస్ట్రీకి పరిచయమయ్యారు. ఈయనతో సినిమా చేసిన తర్వాత కొంత మంది సినిమాలతో దూసుకుపోతే, మరి కొందరు సినిమాలకు దూరమయ్యారు. బన్నీ సినీ లైఫ్ ఎలా చూసుకున్న కూడా ఓ రేంజులో ఉందనే చెప్పాలి. 

విషయానికొస్తే.. బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత మరో సినిమా చేయడానికి దాదాపుగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ కా బాద్షా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమానే అల వైకుంఠపురంలో.. గతంలో వీరిద్దరి కామినేషన్లో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్య మూర్తి సినిమాలు ఏ రేంజులో హిట్ అయ్యాయో అందరికి తెలిసిన విషయమే.. ఇకపోతే తాజాగా వీరిద్దరి జోడితో సినిమా రాబోతుంది. త్రివిక్రమ్ సినిమాలు అంటే ఒక  స్టైల్, ఒక గ్రేడ్ మార్క్ ఉంటుంది. 

ఈ సినిమాలో ఆ వేరియేషన్ చూపిస్తానని డైరెక్టర్ త్రివిక్రమ్ వెల్లండించారు. కాగా, ఆ సినిమా టీజర్ మొన్న విడదల అయింది. టైటిల్ మారిస్తే బెటర్ అనే టాక్ తో వ్యూస్ రాబట్టింది. ఈ సినిమాలో కొంచం క్లాస్, కొంచం మాస్ లుక్ లో బన్నీ కనిపిస్తారని ఈ రోజు రిలీజ్ అయిన పోస్టర్ ని చుస్తే అర్థమవుతుంది. దీనిలో బన్ని లుక్ మాములుగా లేదని అయన అభిమానులు అంటున్నారు. మరి కొందరేమో పవన్ అత్తారింటికి దారేది సినిమా ను కాఫీ కొట్టినట్లు ఉంది పోస్టర్ అంటూ ట్రోల్స్ వేస్తున్నారు. బన్నీకి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. చూడాలి బన్నీ ఏవిందగా మెప్పిస్తాడోనని.. 


మరింత సమాచారం తెలుసుకోండి: