డబ్బు.. డబ్బు .. డబ్బు.. ఈ డబ్బు చేతిలో ఉంటె ఏదైనా చెయ్యొచ్చు అన్నది ఇప్పటి తరం యువత కోరుకుంటోంది.  ఇప్పటి తరం యువత లక్ష్యం ఏంటి అంటే డబ్బు సంపాదించడమే అని చెప్తుంటారు.  పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన కొందరు సెలెబ్రిటీలు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎంత వరకు అవసరమో అంతవరకే ఖర్చు పెడుతుంటారు.  దానికి కారణం ఏంటి.. అంటే డబ్బుపై నియంత్రణ అంటున్నారు.  డబ్బు విషయంలో నియంత్రణ కలిగిన వ్యక్తుల్లో ఒకరు నాగచైతన్య.  


అక్కినేని కుటుంబంలో నాగేస్వర రావు, నాగార్జునలకు వారసుడిగా పుట్టిన నాగ చైతన్యచిన్న తనం నుంచి డబ్బు విషయంలో చాలా నియంత్రణగా పెంచారట.  ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఒకటికి నాలుగు సార్లు అడగాల్సిందే.  ఆ వస్తువు అవసరం ఏంటి అనే విషయాన్ని చెప్పిన తరువాతే ఆ వస్తువు కొనిచ్చేవారట.  


అంతేకాదు, డబ్బు విషయంలో కూడా పెద్దగా ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదట. ఇప్పుడు నియంత్రణగా పెంచారని చెప్తున్నాడు.  అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా కాలం తాను ప్రొడక్షన్ విభాగంలో పనిచేసినట్టు చరణ్ చెప్పారు.  అక్కడ ఎప్పుడు ఎంత ఆవరసరమో.. అంతరవరకే ఖర్చు చేయడం నేర్చుకున్నానని అన్నారు.  అంతేకాదు, అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంటే తట్టుకోలేకపోయేవాడినని అన్నారు.  


తన తల్లి దండ్రుల నుంచి ఈ విషయాలను నేర్చుకున్నానని అన్నారు.  తన పిల్లల విషయంలో కూడా ఇలాగే ఉంటానని, వాళ్లకు కూడా డబ్బు విలువ ఏంటో తెలియజేస్తానని చైతన్య చెప్తున్నాడు.  మరి సామ్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తుందో చూడాలి.  చైతు ఆలోచన బాగానే ఉన్నది.  నాగేశ్వర రావు, నాగార్జున చూపిన బాటలోనే నడుస్తున్నారు.  సామ్ కూడా అక్కినేని కుటుంబంలో ఒకటి అయ్యింది కాబట్టి డబ్బుపై ఇప్పటికే కొంత నియంత్రణ సాధించే ఉంటుంది.  అయితే, సామ్ ఛారిటీలను నిర్వహిస్తూ.. వాటికి డబ్బు ఖర్చు చేస్తుంది.  అటు అమల బ్లూ క్రాస్ కోసం డబ్బు ఖర్చు చేస్తుంది.  అఖిల్ కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.   


మరింత సమాచారం తెలుసుకోండి: