మొన్నటిదాకా బయోపిక్ పర్వం దేశవ్యాప్తంగా కొనసాగింది తర్వాత రీమేక్ పర్వం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో సినిమాలలో ఒకరినిమించి మరొకరు ఎదగాలనే పోటీ కోసం సినిమాలు చేస్తున్నారు హీరోలు. దీంతో వేరే భాషలో హిట్ అయిన సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తెలుగులో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ కొనసాగుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఇటీవల వచ్చిన `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`, `రాక్షసుడు`, `ఎవరు` వంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకనే సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి.


దీంతో చాలా మంది అలాంటి స్టోరీ ల కోసం తెలుగు ప్రొడ్యూసర్లు వెతుకులాట మొదలుపెట్టారు. వేరే భాషల్లో వచ్చిన సినిమాలను రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో  తెలుగు నిర్మాతల దృష్టి సూపర్ హిట్ హిందీ చిత్రం `అంధాదున్`పై పడింది. ఈ సినిమాని నానితో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే అడవి శేషు ని హీరోగా పెట్టి చేద్దామని కొంతమని ప్రయత్నం చేసారు.


అయితే ఈ సినిమా రీమేక్ రైట్ల కోసం పోటీ పడ్డా చివరికి హీరో నితిన్ చాలా పెద్ద మొత్తానికి ఆ సినిమా రీమేక్ రైట్లను దక్కించుకున్నారట. అంతే కాకుండా నితిన్ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డికి ఉన్న సొంత ప్రొడక్షన్ సంస్థ వయాకామ్ 18 సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  ప్రస్తుతం... తెలుగులో ప్రస్తుతం థ్రిల్లర్ల హవా నడుస్తుండడం ఆ సినిమాలు కాసుల పంట కురిపించడం కూడా దీనికి కారణం. మొత్తం మీద ఈ చర్యతో నాని నీ సైడ్ చేసి రంగంలోకి దిగాడు నితిన్.



మరింత సమాచారం తెలుసుకోండి: