దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత  తెరకెక్కిస్తున్న  సినిమా RRR  . ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను ఒకే తెరపై చూడబోతున్నాం.RRR ని డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్  పాత్రలో ,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనబడనున్నారు. ఈ సినిమా ఇద్దరు రియల్ లైఫ్ పాత్రల చూట్టు అల్లిన ఒక కల్పిత గాథ.

RRR సినిమా కాస్టింగ్కి సంబంధించి కొన్ని మోసాలు జరుగుతున్నయి. ఈ సినిమాను ౩౦౦ కోట్ల బడ్జెట్ తో  దాదాపు 2సంవత్సరలు షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాను హీంది మరియు తమిళ భాషల్లో కూడా నిర్మిస్తున్నరు. కాబట్టి చాలా మంది నటీనటుల అవసరం పడుతుంది.

దీన్ని ఆసరాగా తీసుకొని చాలా మోసగాళ్ళు నటీనటులకు కాల్స్ మరియు సోషల్ మీడియా పోస్టలు  చేసి రాజమౌళి గారి సినిమాలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్రను మీకు వచ్చేలా చేస్తేను కాకపోతే నాకు కొంచెం డబ్బులు ఇవ్వలని భేరం మాట్లాడుతున్నారు.రాజమౌళి గారి సినిమా అవ్వడంతో  ముందు వెనక చూడకుండా మోసగాళ్ళు అడిగినంతా డబ్బు ఇస్తున్నారు. ఇలా చాలా మంది తేలికగా మోసపోతున్నరు.

ఈ విషయాన్ని దానయ్య డివివి ట్విటర్ ద్వారా తెలియపరిచారు.కొంత మంది మోసగాళ్ళు రాజమౌళి గారి పేరుతో RRR మూవీ కోసం రాజమౌళి నటీనటుల కోసం వెతుకుతున్నట్లు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఛానల్స్ లో ప్రచారం చేస్తున్నారు...RRR చిత్రానికి సంబంధించిన ఏ విషయం అయినా డివివి సంస్థ అధికారిక ఖాతా ద్వారా వెల్లడిస్తాం. ఎవరు ఇలాంటి మోసగాళ్ళ భారిన పడకూడదు అని హెచ్చరించారు.

 ప్రస్తుత ఈ సినిమా  షూటింగ్ బల్గేరియాలో జరుగుతుంది. బల్గేరియాలో  ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశారు చిత్రికరిస్తున్నారు. ఈ అక్టోబర్ 22 న కొమరం భీమ్ పుట్టిన రోజు సందర్బంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: