టాలీవుడ్ సూపర్ స్టార్స్ లో నందమూరి బాలకృష్ణ ఒకరు. డైలాగ్స్ ను మాసివ్ మూడ్ లో చెప్పడం బాలయ్య స్పెషల్. లెంగ్తీ డైలాగ్స్ ను తనదైన స్టైల్ లో చెప్పే డైలాగ్స్ అభిమానులకు ఖుషీ చేస్తూంటాయి. సంక్రాంతికి ఎన్టీఆర్ – కథానాయకుడు, మహానాయకుడుగా వచ్చిన బాలయ్య ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇటివలే ఈ సినిమా థాయిలాండ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుని హైదరాబాద్ లో ల్యాండ్ అయింది.

 


వినాయకచవితి సందర్భంగా ఈ సినిమాలోని బాలయ్య స్టిల్స్ ను చిత్ర నిర్మాణ సంస్థ సీకే ఎంటర్టైన్ మెంట్స్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో రిలీజ్ చేసింది. టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ‘రూలర్’ అనే టినెటివ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. బాలయ్య స్టైలిష్ గెడ్డంతో ఇటివల రిలీజైన స్టిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే లుక్ లో హెలీకాఫ్టర్ లో దిగుతున్న స్టిల్ ను, హీరోయిన్ సోనాల్ చౌహాన్ తో ఓ సాంగ్ కు సంబంధించిన లుక్ ను సంస్థ రివీల్ చేసింది. బాలయ్య ఈ పిక్స్ లో కాస్త స్లిమ్ గా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్.. సినిమాలో బాలయ్య లుక్స్ కు నెగటివ్ టాక్ రావడంతో ఈసారి బాలయ్య తన లుక్ పై కాస్త దృష్టిపెట్టినట్టున్నాడు. సినిమాలో ఓ లుక్ కోసం బాలయ్య రోజూ 5గంటల పాటు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడని సమాచారం.

 


బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో సొనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సి.కల్యాణ్ నిర్మాణసారధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహ చిత్రాల తర్వాత చిరంతన్ భట్ మళ్లీ బాలయ్య సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 5నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో తర్వాతి షెడ్యూల్ జరుగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: