తెలుగులో లక్కీ లెగ్ హీరోయిన్ అంటే అందరు ఎక్కువ మంది చెప్పే పేరు సమంత.. ఈమె ఎం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ కేరళ కుట్టి ఆ సినిమా కావడంతో, ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఆమె నటించిన ఏ సినిమా అయినా కూడా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసినవే. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన సామ్ అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహామాడింది. ఆ తరువాత కూడా సక్సెస్ ఫుల్ రన్ టైం హీరోయిన్ గా దూసుకుపోతుంది.  

మొన్న వచ్చిన రంగస్థలం, మహానటి, యు టర్న్, మజిలీ, ఓ బేబీ చిత్రం వరకు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమాలే. పెళ్ళైన తరువాత ఈమె మరింత అందంగా కనిపించడానికి చాలా కష్టపడుతుంది. దానికోసం జిమ్ లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. మరో విషయమేంటంటే.. ఈమె ఇప్పుడు మరింత హాట్ గా ఫోటోలను దిగి సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేస్తుంది. 

ఆ ఫొటోలకు వచ్చే లైకులు లకు, కామెంట్లకు ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందో అంతే కైండ్నెస్ తో ఉంటుంది అన్న విషయం అందరికి తెలిసిందే.. ప్రస్తుతం సామ్ అమెజాన్ ప్రైమ్ చేస్తున్న వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం స్పెయిన్ లో చక్కర్లు కొడుతుంది. అక్కడ దిగిన ప్రతిదీ తన సోషల్ మాధ్యమ ఖాతాల్లో షేర్ చేస్తుంది. 

తాజాగా స్పెయిన్ లోని ఓ ప్రయివేట్ పార్టీకి వెళ్లిన సామ్, చైతులు వి విల్ రాక్ యూ అంటూ డ్యాన్సులతో ఇద్దరు కలిసి కాలుకదిపారు. అంతేకాకుండా డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కి నాలాగే నువ్వు యాక్టివ్ గా ఉండాలని ప్రయత్నిస్తావు.. ఐ లవ్ యు బేబీ అంటూ ట్యాగ్ జత చేసింది. ఆ వీడియో మాములుగా లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: